Last Updated:

Britain: బ్రిటన్‌లో టమాటాల కొరత

బ్రిటన్‌ పౌరులను టమాట కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశంలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క టమాటా కనిపించడం లేదు. సూపర్‌ బజర్‌లలో ఖాళీ సెల్ప్‌లు దర్శనిమిస్తున్నాయి.

Britain: బ్రిటన్‌లో టమాటాల కొరత

Britain:బ్రిటన్‌ పౌరులను టమాట కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశంలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క టమాటా కనిపించడం లేదు. సూపర్‌ బజర్‌లలో ఖాళీ సెల్ప్‌లు దర్శనిమిస్తున్నాయి.  బ్రిటన్‌, టమాటాలను మెరాకో, స్పెయిన్‌ల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ రెండు దేశాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి పూర్తిగా పడిపోయింది. దక్షిణ యూరోప్‌, ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి బ్రిటన్‌ పెద్ద ఎత్తున టమాటాలను దిగుమతుల చేసుకుంటోంది .

వాతావరణ మార్పుల కారణంగా తగ్గిన దిగుబడి..(Britain)

ఈ రెండు దేశాల్లో వాతావరణంలో మార్పులు కారణంగా దిగుబడి బాగా తగ్గిపోయింది. ముందుగా ఎండలు విపరీతంగా కాయడం.. అటు తర్వాత భారీ వర్షాలకు వాతావరణ చల్లబడ్డంతో టమాటా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించింది. కాగా బ్రిటన్‌ మోరాకోతో పాటు స్పెయిన్‌పై ఎక్కువగా ఆధారపడి టమాటాలను దిగుమతి చేసుకుంటోంది. మోరాకోలో వాతావరణ చల్లబడ్డంతో అటు తర్వాత భారీ వర్షాలు.. తర్వాత వరదలతో పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. స్పానిష్‌ పంట విషయానికి వస్తే గత నాలుగు వారాల నుంచి వాతావరణ అనుకూలించకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతింది.

భారీవర్షాలతో నిలిచిన సరుకు రవాణా..(Britain)

భారీ వర్షాలకు ఓడల ద్వారా పంపించే సరకు రవాణా కాస్తా రద్దు అయ్యింది. రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో బ్రిటన్‌కు టమాటా రావడం ఇబ్బందికరంగా మారింది. గత కొన్నిరోజుల నుంచి సోషల్‌ మీడియాలో బ్రిటన్‌ సూపర్‌ మార్కెట్లో ఖాళీ సెల్ఫ్‌ ఫోటోలను పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు. మోరిసన్‌ సూపర్‌మార్కెట్‌ ఒక బోర్డు పెట్టి స్పెయిన్‌, మోరాకో నుంచి రవాల్సిన టమాట రాలేదని కస్టమర్లకు తెలియజేసింది.

బ్రిటిష్‌ రిటైల్‌ కన్సార్టియంకు చెందిన డైరెక్టర్‌ ఆండ్రా ఓపీ తాజా పరిణమాల గురించి ప్రస్తావిస్తూ.. రైతులతో మాట్లాడి వీలైనంత త్వరగా తాజా టమాటాలను సరఫరా చేయాలని కోరుతున్నామని చెప్పారు. త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో ప్రజలు కోడి గుడ్లు దొరక్కప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాటి సరసన ప్రస్తుతం టమాట వచ్చి చేరింది. ఇక బ్రిటన్‌ పౌల్ట్రీ రైతుల కష్టాల విషయానికి వస్తే.. కోళ్లకు ఎయియన్‌ ఫ్లూ లాంటి తెగులు రావడంతో కోళ్లు పెద్ద ఎత్తున చనిపోయాయి. దీంతో పాటు ఇంధన ధరలు, ఎరువుల ధరలు బాగా పెరిగిపోయాయని పౌల్ట్రీ రంగానికి చెందిన వ్యాపారులు వాపోతున్నారు.

డిసెంబర్ లోనే హెచ్చరికలు జారీ..

ఇదిలా ఉండగా నేషనల్‌ పార్మర్స్‌ యూనియన్‌ డిసెంబర్‌లోనే హెచ్చరికలు జారీ చేసింది. దేశమొత్తం టమాటాలు, కుకుంబర్‌లతో పాటు రాబోయే నెలల్లో తీవ్ర కొరత ఎదుర్కొంటామని హెచ్చరించారు. బ్రిటన్‌లో ఇంధన వ్యయం బాగా పెరిగిపోయింది. దీంతో ప్రతి వస్తువు ధర పెరిగిపోతోందని ఎన్‌ఎఫ్‌యు వైస్‌ప్రెసిడెంట్‌ డేవిడ్‌ ఎక్స్‌వూడ్‌ చెప్పారు. పరఫరా తగ్గడంతో ధరలు బాగా పెరిగిపోయాయి. జనవరి 2020లో కిలో టమాటా 2.09 పౌండ్లు కాగా గత నెల చివరి నాటికి 2.96 పౌండ్లకు ఎగబాకింది. భారీతీయ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే కిలో టమాట సుమారు 300 వరకు పలుకుతోంది. గత ఏడాది నుంచి బ్రిటన్‌లో ధరలు బాగా పెరిగిపోయాయి.

బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి పెరిగిపోయింది. ఉద్యగులు వేతనాలు పెంచాలని రోడ్లమీదకు వచ్చి సమ్మె చేస్తున్నారు.ఇటీవల ప్రధానమంత్రి రుషి సునార్‌ కూడా నర్సుల సమ్మె గురించి ప్రస్తావిస్తూ.. వేతనాలు పెంచాలని తనకు ఉంది కానీ, పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని.. అందుకే పెంచడం లేదని వివరణ ఇచ్చారు. మొత్తానికి బ్రిటన్‌ పౌరులు ఇటు టమాటాలు దొరక్క.. గుడ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తోంది వేచి చూడాల్సిందే.