Last Updated:

Karthi Japan: కార్తీ ’జపాన్‘ ఫస్ట్ లుక్ రిలీజ్

కోలీవుడ్ హీరో కార్తి ప్రస్తుతం తన 25వ చిత్రం జపాన్‌లో నటిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సామాజిక సందేశంతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రం.

Karthi Japan: కార్తీ ’జపాన్‘ ఫస్ట్ లుక్ రిలీజ్

Tollywood: కోలీవుడ్ హీరో కార్తి ప్రస్తుతం తన 25వ చిత్రం జపాన్‌లో నటిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సామాజిక సందేశంతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రం. కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈరోజు అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ ద్వారా కార్తీ సంపన్న యువకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతను విచిత్రమైన ట్రెండీ లుక్‌తో ఉన్నాడు. అతని డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పోస్టర్‌లో అమ్మాయి కాళ్లు మాత్రం కనపడుతున్నాయి.

జపాన్ ఒక విలక్షణమైన సినిమా అని పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు నటుడు సునీల్ ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకం పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: