Last Updated:

Sardar 2: కార్తీ వర్సెస్ సూర్య.. ఇది అస్సలు ఊహించలేదే

Sardar 2: కార్తీ వర్సెస్ సూర్య.. ఇది అస్సలు ఊహించలేదే

Sardar 2: ఏంటి.. కోలీవుడ్ స్టార్ హీరో బ్రదర్స్ కార్తీ- సూర్య.. సర్దార్ 2 లో కనిపిస్తున్నారా.. ? నిజమేనా.. ? అని ఆశ్చర్యపోకండి. సర్దార్ 2 లో సూర్య కాదు. ఎస్ జె సూర్య నటిస్తున్నాడు. కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో సర్దార్ కూడా ఒకటి. వన్స్ ఏ స్పై.. ఆల్ వేస్ ఏ స్పై. ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ సినిమా 2022 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

 

తండ్రీకొడుకులుగా డబుల్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు కార్తీ. మొదటి పార్ట్ చివరిలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. హిట్ సినిమాకు సీక్వెల్ అంటే.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానుకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యనే సర్దార్ 2 అప్డేట్ ను అందించి మేకర్స్ మరింత ఆసక్తి పెంచేశారు.

 

ఇక తాజాగా సర్దార్ 2 నుంచి ప్రోలాగ్ అనే  పేరుతో ఒక చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో అసలు విలన్ ఎవరో చెప్పుకొచ్చారు. ఈసారి సర్దార్ 2 మరింత ఆసక్తిగా మారబోతుంది. కార్తీకి ధీటుగా ప్రతినాయకుడి పాత్రలో ఎస్ జె సూర్య నటిస్తున్నాడు. ఎస్ జె సూర్య  గురించి ప్రత్యేకంగా తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

ఎస్ జె సూర్య.. వస్తాడు.. నటిస్తాడు.. హిట్ కొడతాడు.. రిపీట్. తెలుగు, తమిళ్ భాషల్లో ప్రస్తుతం టాప్ స్టైలిష్ విలన్ అంటే సూర్య అనే చెప్పాలి. రాయన్, సరిపోదా శనివారం, గేమ్ ఛేంజర్.. సినిమాలతో  ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎస్ జె సూర్యను.. మిత్రన్, సర్దార్ 2 కోసం దింపాడు.

 

ఇక ఈ గ్లింప్స్ లో చైనా వెళ్లి.. అక్కడ కొంతమంది విలన్స్ ను సర్దార్ చంపి.. చాంగ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే మొదటి పార్ట్ లో వాటర్ సమస్య నుంచి తన దేశాన్ని కాపాడుకున్న సర్దార్ కి.. మరో సమస్య ఎదురుకానుందని చూపించారు. ఒక పెద్ద విలన్ గా సూర్యను చూపించారు. అతడి నుంచి దేశాన్ని సర్దార్ ఎలా కాపాడాడు.. ? తండ్రికి కొడుకు ఎలా సహాయపడ్డాడు అనేది సినిమా కథగా తెలుస్తోంది.

 

సర్దార్ 2 లో ఈసారి కార్తీ కన్నా ఎస్ జె సూర్య హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ మేకోవర్ లో బ్లాక్ డాగర్ గా సూర్య కనిపించాడు. ప్రస్తుతం సూర్యకు ఉన్న మార్కెట్ ను బట్టి.. ఈ సినిమా  హిట్ అయితే మాత్రం కార్తీకి ఖాతాలో బ్లాక్ బస్టర్ పడినట్టే. మరి ఈ సినిమాలో కార్తీ – సూర్యల బీభత్సం ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే.