Samantha: ట్రోలర్స్‌పై సమంత ఫైర్.. అలా చేయాలంటూ సవాల్

Samantha: నటి సమంత ఫిట్‌నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఇటీవల ఆమె లుక్స్‌పై పలువురు కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. సమంత చిక్కిపోయారని, అనారోగ్యంగా కనిపిస్తున్నారని పలువురు మాట్లాడుకున్నారు. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నెటిజన్లకు సవాల్ విసిరారు. ఆ సవాల్ పూర్తి చేయకపోతే తనను ఆ విధంగా కామెంట్ చేయొద్దని కోరారు.
సమంత తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో జిమ్‌లో పుల్ అప్స్ చేస్తూ కనిపించారు. డీల్ కుదుర్చుకుందాం. ఇందులో చూపించిన విధంగా మీరు మూడు పుల్ అప్స్ చేసేవరకు సన్నబడ్డావు, ఆరోగ్యం బాలేదా? లేక ఇతర చెత్త కామెంట్స్ తనపై చేయొద్దన్నారు. పుల్ అప్స్ మీరు చేయలేకపోతే ఇకపై ఆ విధంగా మాట్లాడొద్దని రాసుకొచ్చారు.
సమంత ప్రస్తుతం నటిగా కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సమంత నిర్మించిన శుభం మూవీ విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న రక్త్ బ్రహ్మాండ్ చిత్రీకరణ దశలో ఉంది. దర్శకద్వయం రాజ్, డీకే దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం సాయంత్రం సమంత ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రెండీ లుక్‌లో కార్యక్రమానికి హాజరయ్యారు. నటి శ్రీలీలతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలపై పలువురు స్పందించారు. ఆమె బాగా సన్నబడ్డారన్నారు.
ఆరోగ్యపరంగా సమంత కొంతకాలం కింద మయోసైటిస్ బారిన పడ్డారు. తాను మయోసైటిస్‌తో ఇబ్బంది పడుతున్నట్లు 2022లో తెలిసిందని గతంలో చెప్పారు. దానిని ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నానని తెలిపారు.