Published On:

Samantha: అలా అయితే ప్రశాంతత ఉండదు..: సమంత పోస్ట్‌

Samantha: అలా అయితే ప్రశాంతత ఉండదు..: సమంత పోస్ట్‌

Samantha posts on Instagram: నటి సమంత ఇన్‌స్టా వేదికగా సందేశాత్మక పోస్ట్‌ పంచుకున్నారు. ఇతరుల మాటలతో మానసిక ప్రశాంతత దెబ్బ తీసుకోవద్దంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ఇతరుల మాటలను పట్టించుకోకుండా నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. ఏదైనా జరగనీ అన్నట్లు ఉంటే ప్రశాంతత రాదు అని చెప్పారు. దాని కోసం నిరంతర సాధన అవసరమన్నారు. ప్రశాంతతను ఆస్వాదించాలి గానీ దానితో పోరాడొద్దన్నారు. జరగాల్సిన దాన్ని జరగనివ్వాలన్నారు. తను చేయాల్సింది అనే భావనను తప్పకుండా చేయాల్సిందేనని పేర్కొన్నారు. మనసు వేగంతో కాదని, నిశ్చలత్వంతో ప్రశాంతంగా మారుతుందన్నారు. మనం పెట్టుకునే సరిహద్దులు ఆత్మగౌరవంలో భాగమే అన్నారు. ఒత్తిళ్లు గౌరవానికి అవరోధం కాకూడదన్నారు. మీ శక్తిని తీసుకోవడానికి ఎవరూ అర్హులు కాదని ఆమె రాసుకొచ్చారు. ఆమె ఉన్నట్టుండి ఈవిధంగా మానసిక ప్రశాంతత గురించి పోస్ట్‌ ఎందుకు పెట్టారో తెలియరాలేదు.

 

వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో సమంత కొన్నిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తోన్నది. దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో సమంత రిలేషన్‌లో ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. వృత్తిపరమైన పనుల రీత్యా ఇటీవల ఆమె దుబాయ్‌కు వెళ్లారు. వెకేషన్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆమెతో రాజ్‌ నిడిమోరు కూడా ఉన్నారనే కామెంట్స్‌ వచ్చాయి. మరోవైపు, రాజ్‌ సతీమణి శ్యామాలి కూడా వరుస సందేశాత్మక పోస్టులు షేర్‌ చేస్తున్నారు. కర్మ సిద్ధాంతం, నమ్మకం గురించి సందేశాలు పంచుకున్నారు. నమ్మకం అనేది అన్నిటికంటే విలువైనదని, ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి పొందలేరని సందేశాన్ని ఇటీవల ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి: