Rakt Bramhand Project: సమంత సిరీస్ ఆగిపోయిందా..? మేకర్స్ ఏమన్నారంటే..?

Heroine Samantha’s Rakt Bramhand Series: తెలుగులో శుభం సినిమాతో ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు రాజ్ అండ్ డీకేతో కలిసి తీశారు. ఆ తర్వాత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులకు కొంత ఇబ్బంది పెట్టినా.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే సమంత మరో వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో ఆదిత్యరాయ్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే డైరెక్షన్ చేస్తున్నారు. తాజాగా, ఈ వెబ్ సిరీస్‌పై గత కొంతకాలంగా రూమర్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయిందని, ఇక సమంతకు మళ్లీ కష్టాలే అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు షెడ్యూల్ ప్రకారమే నడుస్తోందని వివరించారు.
‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌ను గత కొంతకాలంగా షెడ్యూల్ ప్రకారం నిర్మిస్తున్నామన్నారు. ఇటీవల ఇండోర్ టాకీ షెడ్యూల్ చేపట్టగా దాదాపు చివరి చేరకుందని మేకర్స్ వెల్లడించారు. ఇక, ఇది ముగిసిన వెంటనే అవుట్ డోర్ కూడా ఆలోచిస్తున్నామన్నారు. ఈ అవుట్ డోర్ లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని, వీటిని ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తామని చెప్పారు. అందుకే ఈ యాక్షన్ సన్నివేశాలకు అనుగుణంగా లోకేషన్లను పరిశీలిస్తున్నామన్నారు. ఈ సన్నివేశాలు తీయాలంటే తప్పనిసరిగా వర్షాలు పడాలి. ఈ వర్షాలు పడే సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని, అప్పుడే వీటిని చిత్రీకరించాలని చెప్పుకొచ్చారు. మొత్తం గ్రీనరీగా ఉండాలని, అందుకే మరికొన్ని రోజులు వెయిట్ చేసి కొత్ షెడ్యూల్ మొదలుపెడ్తామని చెప్పారు.