Kamal Haasan: కన్నడ భాష వివాదం – కర్ణాటక హైకోర్టు ఆశ్రయించిన కమల్ హాసన్
Kamal Haasan Approach Karnataka High Court: విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని,లేదంటే కమల్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని కర్ణాటక అధికార, విపక్ష పార్టీలు, సంఘాలు భగ్గుమంటున్నాయి. కమల్ తీరుపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా అసహనం వ్యక్తం చేసింది.
మే 30కి ఆయనకు డెడ్‌లైన్ పెడుతూ కమల్ క్షమాపణలు చెప్పాలని, లేదంటే థగ్‌లైఫ్ మూవీ రిలీజ్‌ను రాష్ట్రం నిషేధం విధిస్తామని ప్రకటన చేసింది. కమల్ ఈ విషయంలో తాను క్షమాపణలు చెప్పేదే లేదన్నారు. అటూ కర్ణాటన ప్రభుత్వం, కేఎఫ్‌సీసీ కూడా థగ్‌లైఫ్ రిలీజ్‌ని అడ్డుకుంది. ఈ పరిణామల నేపథ్యంలో కమల్ తాజాగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమా థగ్ లైఫ్‌ని రాష్ట్రంలో విడుదల ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ పిటిషన్‌ను తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా హైకోర్టులో దాఖలు చేశారు. తన సినిమా విడుదలకు ఆటంకం కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు శాఖ, చలన చిత్ర వాణిజ్య విభాగాలను ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. థగ్‌లైఫ్ స్క్రీనింగ్‌కు తగిన భద్రత కల్పించేలా డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్‌కు సూచనలు జారీ చేయాలని కమల్ హాసన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘తమిళ భాష నుంచే కన్నడ పుట్టింది’ అన్నారు.
ఈ వ్యాఖ్యలను కన్నడీగుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. కమల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్స్ వస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీలు కమల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కన్నడ భాష, కన్నడిగులను తరచూ తమిళ్ వాళ్లు అవమానపరుస్తున్నారని, వారి కొత్త సినిమాలు విడుదలైన ప్రతిసారి కన్నడ వాళ్లకు అవమానాలు ఎదురవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కానీ కమల్ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోను అన్నారు. అవి ప్రేమతో చేసిన కామెంట్స్ అన్నారు. ఇక తాను తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతానని, లేని పక్షంలో క్షమాపణలు చెప్పేదే లేదన్నారు.