Published On:

PSBK vs RCB: పంజాబ్ టార్గెట్ 191

PSBK vs RCB: పంజాబ్ టార్గెట్ 191

PSBK vs RCB:  ఈ మ్యాచ్ తో ఐపీఎల్ 2025 సీజన్ పూర్తి అవుతుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరుతో పంజాబ్ ఢీకొట్టింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పంజాబ్. నిర్ణిత 20 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 190పరుగులు చేసింది. ఆర్సీబీ ఓపెనర్లు సాల్ట్ 9బంతుల్లో 16పరుగులు చేసి మొదటి వికెట్ గా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 35బంతుల్లో 43పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన అగర్వాల్ 18బంతుల్లో 24పరుగులు చేశాడు. పాటీదార్ 16బంతుల్లో 26, లివింగ్ స్టన్ 15బంతుల్లో 25, జితేష్ శర్మ 10బంతుల్లో 24, షెపర్డ్ 9బంతుల్లో 17పరుగులు, క్రుణాల్ పాండ్యా 5బంతుల్లో 4 పరుగులు, భువనేశ్వర్ రెండు బంతుల్లో ఒకటి, దయాల్ ఒక బంతికి ఒక రన్ చేశారు. పంజాబ్ బౌలర్లు మొదటినుంచి ఆర్సీబీపై ఆదిపత్యం ప్రదర్శించారు.

 

అర్శదీప్ మొదట్లో పెద్దగా వికెట్లు తీయలేదు చివరి ఓవర్లలో మాత్రం రెండు వికెట్లు పడగోట్టాడు. దీంతో 4 ఓవర్లు వేసి 3వికెట్లు తీసుకున్నాడు. జెమిసన్ కూడా 3 వికెట్లు పడగొట్టగా, అజ్మతుల్లా, విజయ్ కుమార్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి: