Published On:

Imran Khan : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌‌పై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

Imran Khan : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌‌పై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

Former Prime Minister Imran Khan’s sensational comments : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిం మునీర్‌పై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునీర్‌కు ప్రతీకార స్వభావం ఉందని, అతడిని ఐఎస్‌ఐ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత తన భార్య బుష్రా బీబీని లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేశాడన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ జైల్లో ఉన్నారు. తన కుటుంబంతోపాటు పార్టీ కార్యకర్తలను అన్యాయంగా జైల్లో పెడుతున్నారని వాపోయారు.

 

ప్రధాని హోదాలో ఐఎస్‌ఐ డీజీ పదవి నుంచి జనరల్‌ మునీర్‌ను తొలగించినట్లు చెప్పారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు తన భార్య బుష్రా బీబీని సంప్రదించేందుకు మధ్యవర్తుల ద్వారా ఆయన ప్రయత్నాలు చేశాడని పేర్కొన్నారు. అటువంటి వాటిలో జోక్యం చేసుకోనని, తనను సంప్రదించవద్దని తన భార్య కరాఖండీగా పేర్కొంది. దాంతో ఆమెకు అన్యాయంగా 14 నెలల శిక్ష విధించి జైల్లో అమానవీయంగా ప్రవర్తించాడన్నారు. దాని వెనుక ఆసిం మునీర్‌ ప్రతీకార స్వభావం స్పష్టంగా కనిపిస్తోందని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

 

వ్యక్తిగత ప్రతీకారం కోసం తన భార్యను లక్ష్యంగా చేసుకున్న తీరు ఉహించనిదన్నారు. పాకిస్థాన్ నియంతృత్వ చీకటి రోజుల్లో అలా జరగలేదని పేర్కొన్నారు. రాజకీయాలకు సంబంధం లేని తన భార్యపై అనేక కేసులు పెట్టారని, నెల రోజులుగా ఆమెతో భేటీ కావనివ్వడం లేదన్నారు. ‘లండన్‌ ప్లాన్‌’లో భాగంగా మే 9, 2023న (ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన రోజు చెలరేగిన హింస) ఘటన చోటుచేసుకుందని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: