Published On:

Amardeep – Supritha Movie: అమర్‌ దీప్‌తో సురేఖ్‌ వాణి కూతురు సుప్రీత మూవీ.. మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌!

Amardeep – Supritha Movie: అమర్‌ దీప్‌తో సురేఖ్‌ వాణి కూతురు సుప్రీత మూవీ.. మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌!

CHOWDARY GARI ABBAYI THO NAIDU GARI AMMAYI Movie Title Glimpse: బిగ్‌బాస్‌ ఫేం అమర్‌ దీప్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ నుంచి బయటకు రాగానే హీరోగా ఆఫర్‌ కొట్టేశాడు. ఈ సినిమాలో అమర్‌ దీప్‌ సరసన నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్‌గా నటిస్తుంది. ఇద్దరికి ఇది వెండితెర డెబ్యూ మూవీ. బుల్లితెరపై అమర్‌, సోషల్‌ మీడియాలో సుప్రీత మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇద్దరు హీరోహీరోయిన్లుగా నటిస్తూ.. వెండితెర ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా కోసం వారి ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా.. స్లో స్లోగా ముందుకు వెళుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్‌ మాత్రం ఫిక్స్‌ చేయలేదు. తాజాగా మూవీ టైటిల్‌ని ప్రకటిస్తూ మేకర్స్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో అమర్‌, సుప్రీతల లవర్స్‌గా మంచి రొమాంటిక్‌గా కనిపించారు. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ అదరిందంటూ అభిమానుల నుంచి కామెంట్స్‌ వస్తున్నాయి.

 

ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ సందర్భంగా మూవీ టీం మీడియాతో ముచ్చటించింది. ఈ మేరకు సుప్రీత మాట్లాడుతూ.. “సినిమా ప్రారంభంలో నాకు భయం వేసింది. కానీ ఇప్పుడు చాలా కాన్పిడెంట్‌గా ఉన్న. మా నిర్మాత నన్ను తన ఇంటి అమ్మాయిలా చూసుకున్నారు” అని చెప్పుకొచ్చింది. ఇక అమర్‌ దీప్‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక సినిమా ఎందుకు లేట్‌ అవుతుంది అడుగుతున్నారు. చక్కగా ప్లాన్‌ చేసుకుని మంచి సినిమాతో రావాలని అనుకున్నాను. అది కుదరడానికి ఇంత సమయం పట్టింది. ఈ సినిమా అందరికి నచ్చుతుందని అని అన్నాడు.

 

 

ఇవి కూడా చదవండి: