Published On:

Samsung Galaxy S25 Edge Offers: త్వరగా కొనుక్కో.. లక్ష రాపాయల ఫోన్‌పై లక్కీ ఆఫర్.. ఈ ఫోన్ చాలా ఫేమస్..!

Samsung Galaxy S25 Edge Offers: త్వరగా కొనుక్కో.. లక్ష రాపాయల ఫోన్‌పై లక్కీ ఆఫర్.. ఈ ఫోన్ చాలా ఫేమస్..!

Samsung Galaxy S25 Edge Offers: సామ్‌సంగ్ అత్యంత సన్నని ఫోన్ Galaxy S25 Edge ఇప్పుడు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధరను కంపెనీ రూ.1,09,999గా ఉంచింది. మీరు ఇప్పుడు ఈ ఫోన్‌ని సామ్‌సంగ్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. పరిమిత సమయం వరకు ఫోన్ రూ. 12,000 వరకు తగ్గింపుతో లభిస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే ఫోన్ మందం 5.8 మిమీ మాత్రమే.

 

ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల క్వాడ్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ అందించారు. ఈ ఫోన్ 256జీబీ మోడల్ ధర రూ.1,09,999, 512జీబీ వేరియంట్ ధర రూ.1,21,999. అయితే, ప్రస్తుతానికి అత్యంత ప్రత్యేకమైన ఆఫర్ ఏమిటంటే, 256జీబీ ధరకే 512జీబీ వెర్షన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని సామ్‌సంగ్ అందిస్తోంది. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

Samsung Galaxy S25 Edge Discount Offer
ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్ 256జీబీ+ 512జీబీ రెండు వేరియంట్‌లపై బ్యాంక్ డిస్కౌంట్లను అందిస్తోంది. సామ్‌సంగ్ అధిక వేరియంట్‌పై ఉత్తమ ఒప్పందాన్ని ప్రకటించింది. 512జీబీ వేరియంట్‌ని 256జీబీ ధరకే అందిస్తోంది. అంటే రెండు వేరియంట్లు సామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 1,09,999 కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

 

అంటే ఈ ఆఫర్‌తో మీరు హై ఎండ్ వేరియంట్ పై రూ. 12,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మొత్తంమీద, మీరు తక్కువ డబ్బుకు ఎక్కువ నిల్వను పొందచ్చు. మరోవైపు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి 512GB వేరియంట్‌పై రూ.6,100 తగ్గింపును అందిస్తోంది, దీనితో ధర రూ.1,15,899కి తగ్గింది. అదేవిధంగా 256GB వేరియంట్ కూడా అదే కార్డ్ ఆఫర్‌తో రూ. 5,499 తగ్గింపును పొందుతోంది. ఈ ఆఫర్‌తో మీరు బేస్ వేరియంట్‌ను కేవలం రూ.1,04,499కే కొనుగోలు చేయవచ్చు.

 

Samsung Galaxy S25 Edge Specifications
సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫీచర్ల గురించి మాట్లాడితే 6.7-అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 1Hz నుండి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌పై పనిచేస్తుంది. గేమింగ్ లేదా 4K వీడియో రికార్డింగ్ వంటి భారీ పనులను సులభంగా నిర్వహించగలదు. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ IP68-రేటెంగ్‌తో వాటర్, డస్ట్ ప్రూఫ్‌గా ఉంటుంది.

 

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం, ఈ ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది, ఇది బేస్ S25 కంటే తక్కువ కాంతిలో 40 శాతం ప్రకాశవంతమైన ఫోటోలను తీయగలదని సామ్‌సంగ్ పేర్కొంది. ఈ ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి, ఇది మాక్రో షూటర్‌గా కూడా పనిచేస్తుంది. సెల్ఫీలు , వీడియో చాట్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.