Sandhya Theatre: సంధ్య థియేటర్‌లో భారీ నాగుపాము కలకలం – వీడియో వైరల్
Cobra Snake Sandhya Theatre Video Goes Viral: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలు, బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలు ఈ థియేటర్లలో చూసేందుకే ఆడియన్స్, ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. చివరికి హీరోలు సైతం సినిమా చూడాలన్న ఈ థియేటర్‌కే వస్తారు. అంతగా గుర్తింపు పొందిన ఈ థియేటర్.. అలా అని మల్టీప్లెక్స్, పీవీఆర్ రేంజ్‌లో లగ్జరీ ఉంటుందా అంటే అలా ఉండదు. ఇది ఒక సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్. చెప్పాలంటే మాస్ ఆడియన్స్‌కి ఇది కేరాఫ్ అని చెప్పాలి.
స్క్రీన్‌పై తమ హీరోల నటన, యాక్షన్ అని చూస్తుంటే ఎంజాయ్ చేసే మూవీ. మూవీ చూస్తున్నంత సేపు అరుపులు, కేకలు, ఈళలతో ఎంజాయ్ చేయాలనుకునేవారంత ఈ థియేటర్‌కే వెళ్లాలి. అక్కడ ప్రేక్షకుడిగా అంత ఫ్రీడమ్ ఉంటుంది. పుష్ప 2 రిలీజ్ టైంలో వేసిన బెనిఫిట్ షోలో జరిగిన తొక్కిసలాట ఓ మహిళ మరణించడం, ఆమె కొడుకు తీవ్ర అస్వస్థతకు గురైన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దీంతో సంధ్య థియేటర్ పేరు వార్తల్లో, సోషల్ మీడియాలో మారుమ్రోగింది. తాజాగా మరోసారి ఈ థియేటర్ పేరు వార్తల్లో నిలిచింది.
తాజాగా ఈ థియేటర్‌లో పాములు కలకలం రేపాయి. రూ. 50 టికెట్ ఇచ్చే ఎంట్రీ వద్ద ఓ పెద్ద పాము బుసలు కొడుతూ కనిపించింది. దానిని గుర్తించిన థియేటర్ సిబ్బంది.. స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి పాము పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారీ పొడవు ఉన్న ఈ నాగుపాము.. బుసలు కొడుతూ చాలా కోపం కనిపించింది. అలాంటి కోబ్రా స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టేసి దాన్ని తీసుకువెళ్లిపోయాడు. అయితే సంధ్య థియేటర్‌లో పాములు కనిపించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు థియేటర్‌లో పాములు దూరిన సంఘటలు ఉన్నాయి. ఇక రోడ్డు పక్కనే ఉన్న ఈ థియేటర్లలోకి పాములు రావడం స్థానికుల కలవరపెడుతుంది.
సంధ్య థియేటర్‌లో పాముల కలకలం
ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు
పాములు తరచుగా లోపలికి వస్తున్నాయని సిబ్బంది ఆందోళన pic.twitter.com/l8Q6wDFH0N
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025
ఇవి కూడా చదవండి:
- Naga Vamsi Tweet: బన్నీ కాదు.. చరణ్ కాదు.. ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ మూవీ, హింట్ ఇచ్చిన నిర్మాత