High Court: మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

High Court notices to Telangana Government: కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలను సకాలంలో ఎందుకు నిర్వహించలేదో కారణం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణలో ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణ జాప్యంపై కారణాలు తెలపాలని సర్కారుకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ జులై 11కి వాయిదా వేసింది.
పంచాయతీ ఎన్నికలకు సైతం..
మరో వైపు 3 నెలల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30వరకు ఫలితాలు వెల్లడించాలని డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో సర్కారు కసరత్తు ప్రారంభించింది. కాగా, ఇంతలో మున్సిపల్ ఎన్నికల విషయంలో నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. దీంతో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.