Published On:

Naga Vamsi Tweet: బన్నీ కాదు.. చరణ్‌ కాదు.. ఆ స్టార్‌ హీరోతో త్రివిక్రమ్‌ మూవీ, హింట్‌ ఇచ్చిన నిర్మాత

Naga Vamsi Tweet: బన్నీ కాదు.. చరణ్‌ కాదు.. ఆ స్టార్‌ హీరోతో త్రివిక్రమ్‌ మూవీ, హింట్‌ ఇచ్చిన నిర్మాత

Jr NTR Replaced Allu Arjun in Trivikram Mythological Movie: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్‌ ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబో ఎప్పుడో సెట్ అయిన పుష్ప 2 షూటింగ్‌ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ ఆలస్యం అయ్యింది. ఈ మూవీ రిలీజ్‌ బన్నీ-త్రివిక్రమ్‌ సెట్స్‌పై వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఆల్మోస్ట్‌ ఈ మూవీ అంత ఒకే అయ్యిందని, ఇక అనౌన్స్‌మెంట్‌, పూజ కార్యక్రమాన్ని జరిపించడమే అన్నారు.

 

కానీ, అంతోఏ అట్లీ ఎంట్రీ ఇచ్చాడు. త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌ని కాదని ముందు తమిళ డైరెక్టర్‌ అట్లీ మూవీని లైన్‌లో పెట్టాడు. చూస్తుంటే బన్నీ-త్రివిక్రమ్‌ మూవీ ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అయితే ఈ గ్యాప్‌లో రామ్‌ చరణ్‌తో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ప్లాన్‌ చేశాడట త్రివిక్రమ్‌. ఇక ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రకటన కూడా రానుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ, నిర్మాత నాగవంశీ వరుస ట్వీట్స్‌ చూస్తుంటే చరణ్‌-త్రివిక్రమ్‌ కాంబో సెట్‌ అయినట్టు కనిపించడం లేదు. దీనిపై ఎలాంటి క్లారిటీ రాకపోముందే మరో హీరో లైన్లోకి వచ్చాడు. త్రివిక్రమ్‌ బన్నీ, చరణ్‌తో కాకుండ జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

 

నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా దీనిపై హింట్‌ కూడా ఇచ్చేసాడు. ఈ మేరకు వరుస ట్వీట్స్‌ చేశాడు. త్రివిక్రమ్‌ బన్నీతో మైథలాజికల్‌ ఫాంటసీ చిత్రాన్ని ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే స్టోరీని ఎన్టీఆర్‌ కలిసి చేయబోతున్నారట. తారక్‌ ఇందులో కార్తికేయ భగవానుడిలో పాత్రలో నటించనున్నాడని నాగవంశీ ట్వీట్‌ చూస్తుంటే తెలుస్తోంది. కార్తికేయ భగవానుడి శ్లోకాన్ని షేర్ చేస్తూ.. “అత్యంత శక్తివంతమైన దేవుడిగా నాకెంతో ప్రియమైన అన్న చేయబోతున్నాడు” అని ట్వీట్‌ చేశాడు. దానికంటే ముందు ఓ శ్లోకాన్ని షేర్‌ చేస్తూ.. “గాడ్‌ ఆఫ్‌ వార్‌ వచ్చేస్తున్నాడు” అంటూ హింట్‌ ఇచ్చాడు. అంటే త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ కాంబో ఫిక్స్‌ అయ్యందని, ఈ మైథలాజికల్‌ ఫాంటసీ డ్రామాలో మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ నటించబోతున్నట్టు నాగవంశీ చెప్పకనే చెప్పాడు.

 

ఈ కాంబో సెట్‌ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్‌ అంత పండగ చేసుకుంటున్నారు. దీంతో రెండు రోజులు అభిమానుల్లో నెలకొన్న కన్‌ఫ్యూజన్‌కి ఈ ట్వీట్‌తో తెరపడినట్టయ్యింది. కాగా త్రివిక్రమ్‌ చివరిగా మహేష్‌ బాబు ‘గుంటూరు కారం’ మూవీ చేశాడు. అదే టైంలో అల్లు అర్జున్‌ కోసం పాన్‌ ఇండియా స్థాయిలో మైథాలాజికల్‌ ఫాంటసీ డ్రామాను ప్లాన్‌ చేశాడు. గుంటూరు కారం తర్వాత స్క్రిప్ట్‌ డెవలప్ చేసి బన్నీ కోసం కథ సిద్ధం చేశాడు. అయితే అనుకోకుండా అట్లీ లైన్లోకి రావడంతో ఈ ప్రాజెక్ట్‌కి బ్రేక్‌ పడింది. దీంతో త్రివిక్రమ్ ఈ కథను ఎన్టీఆర్‌ దగ్గరికి తీసుకువెళ్లడంతో ఆయన గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చినట్టు గుసగుస.