Amit Shah: ప్రపంచ పోలీసు క్రీడలకు భారత్ ఆతిథ్యం: అమిత్ షా

World Police and Fire Games: ప్రతిష్ఠాత్మకమైన 2029 ప్రపంచ పోలీసు, అగ్నిమాపక క్రీడలకు ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికైనట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా క్రీడలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశం దక్కడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు.
పోలీసు క్రీడల నిర్వహణకు భారత్ ప్రతిష్ఠాత్మక బిడ్‌ను గెలుచుకొందని అమిత్ షా తెలిపారు. కేంద్రం నిర్మించిన విస్తారమైన క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కొనియాడారు. 1985 నుంచి రెండేళ్లకోసారి ప్రపంచ పోలీసు, అగ్నిమాపక కీడ్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 20 సార్లు పోటీలు జరిగాయన్నారు. అమెరికా 8, కెనడా 5, యూరప్ 4, బ్రిటన్ 2, చైనా ఒకసారి క్రీడలు నిర్వహించాయని తెలిపారు. 2007 నుంచి 2023 వరకు భారత పోలీసు సిబ్బంది 1400 పతకాలు గెలుచుకున్నారని అమిత్ షా వివరించారు.