Acid Reflux And GERD: ఆహారం తీసుకున్న వెంటనే గొంతులో మండుతుందా.? ఇవే నివారణలు..!

Acid Reflux And GERD: ఆహారం తిన్న తర్వాత తరచుగా గుండెలో మంట వస్తుందా. నోటిలో పుల్లగా, కడుపులో మంట వచ్చి మింగడానికి ఇబ్బందిగా ఉందా.. దాన్నే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ అంటారు. దీని వలన భారత్ దేశంలో 10శాతం మంది దీనివలన బాధపడుతున్నారు. యాసిడ్ రిఫ్లక్స్ వలన శరీరానికి హాని కలిగించవచ్చు. దీనికి చికిత్స చేయకపోతే, ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయి. దీన్ని నివారించాలంటే జీవనశైలి సర్దుబాట్లను చేయవచ్చు. ప్రధానంగా ఆహారపు అలవాట్లలో, అలాగే రోజువారీ జీవితంలోని ఇతర భాగాలలో కూడా మార్పులు అవసరం.
యాసిడ్ రిఫ్లక్స్ అనేది కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి వెనుకకు వెళ్లడం వల్ల వస్తుంది. దీనివలన గుండెల్లో మంట వస్తుంది. ఇది మళ్లీ మళ్లీ రావడం వలన వాపుకు దారితీస్తుంది. ఈ లక్షణాలు వారానికి రెండు సార్లు కంటే ఎక్కువ సంభవించినప్పుడు, దీనిని గ్యాస్ట్రో-ఓసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధిగా పరిగణించవచ్చు.
చికిత్స చేయకపోతే అధిక మంట మరియు క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. మందుల వాడకం ద్వారా లక్షణాలను తగ్గించవచ్చు, కానీ ప్రధాన పరిష్కారం జీవనశైలిని మార్చుకోవడమే. ఎందుకంటే ఆహారపు అలవాట్లు తరచుగా వ్యాధికి కారణం అవుతాయి.
మీ ఆహారంలో మీరు చేయగలిగే మార్పులు
మామూలుగా భోజనాన్ని 3 పూటలుగా విభజిస్తారు. అందులో ఉదయం టిఫిన్ తింటారు. మిగితా రెండు పూటలు భోజనం చేస్తారు. అయితే తయచుగా బోజనం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకేసారి కాకుండా రెండు పూటల బోజనాన్ని 6 సార్లు కొద్ది కొద్దిగా తినాలని సూచిస్తున్నారు.
కొన్ని ఆహారాలను తినక పోవడమే ఉత్తమం
కొన్ని ఆహార పదార్థాలు దిగువ అన్నవాహికకు చికాకుపరుస్తాయి. ఆమ్లాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కడుపులో, గుండెలో మంటను కలిగిస్తాయి. అయితే ఈ ఆహారాలలో సిట్రస్ పండ్లు, టమోటాలు, కారంగా ఉండే ఆహారాలు, చాక్లెట్, పిప్పరమెంటు, కెఫిన్, ఆల్కహాల్, వేయించిన ఆహారం, అధిక కొవ్వు ఉన్న ఆహారం వలన ఆమ్లాలు ఎక్కువవుతాయి.
మంచి పానీయాలను ఎంచుకోండి
సోడాలు, కెఫిన్ మరియు సిట్రస్ రసాలు LES ను చికాకుపరుస్తాయి, దీనివల్ల ఆమ్లం అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇందుకు అల్లం లేదా చమోమిలే టీ ప్రత్యామ్నాయం. ముఖ్యంగా అవి కడుపుపై ఉపశమన ప్రభావాలను కలిగి ఉంటాయి. మంటను తగ్గిస్తాయి జీర్ణక్రియను పెంచుతాయి.
పడుకునేటప్పుడు ఎడమవైపు పడుకోవాలి
చదునుగా పడుకోవడం వల్ల ఆమ్లం పైకి వస్తుంది. దీంతో గుండెలో, గొంతులో మంట వస్తుంది. అప్పుడు తలని దిండుతో స్థిరంగా ఉంచాలి. ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి.
తిన్న తర్వాత 60 అడుగులు నడవాలి
ప్రస్తుత పనుల ఒత్తిడిలో తిన్న వెంటనే నడవడం లేదు. కానీ తిన్న తర్వాత తక్కువలో తక్కువగా 60 అడుగులు నడవాలని అంటారు. ఇది ప్రేగుల కదలికను మెరుగ్గా చేసి జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. రిప్లక్స్ ను నివారిస్తుంది. దీంతో పాటే సిగరెట్ అలవాటు ఉన్నవాళ్లు మానివేయండి.