Singer Mangli Case: బర్త్ డే పార్టీ.. సింగర్ మంగ్లీపై కేసు – ఎఫ్‌ఐఆర్ సంచలన విషయాలు
Singer Mangli Birthday party Case FIR Goes Viral: సింగర్ మంగ్లీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు, సన్నిహితులకు రిసార్ట్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చింది. చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్ జరిగిన ఈ బర్త్ డే పార్టీకి సుమారు 50 మంది హాజరయ్యారు. స్థానికుల సమాచారం రిస్టార్ట్‌పై చేవేళ్ల పోలీసులు దాడి చేయగా.. పార్టీ విదేశీ మద్యం, గంజాయి వినియోగించినట్టు గుర్తించారు.
దీంతో సింగర్ మంగ్లీ, రిస్టార్ట్ మేనేజర్‌పై కేసు నమోదు చేసి విచారించారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. మంగళవారం అర్థరాత్రి ఒంటి గంట తర్వాత కూడా పార్టీ కొనసాగింది. అర్థరాత్రి రిస్టార్ట్ నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ హంగామా చేస్తున్నారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఒక మహిళా ఎస్సైతో పాటు పోలీసులు అధికారులు రిసార్ట్‌పై దాడి చేశారు.
ఆ టైంలో 10 మంది పురుషులు, 12 మంది స్త్రీ డిజే పెట్టి డ్యాన్స్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. వారంత కూడా మద్యం మత్తులో ఉన్నారు. మంగ్లీ బర్త్‌డే పార్టీ జరుగుతున్నట్టు అక్కడ ఉన్న మేనేజర్ పోలీసులు చెప్పారు. దీంతో లోపలికి వెళ్లి పోలీసులు సోదాలు నిర్వహించగా.. విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 50 మందిలో 48 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఒక్కరు గంజాయి తీసుకున్నట్టు తేలిసింది. మంగ్లీ అనుచరుడైన దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్టు గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్ చేశాం.
అనంతరం మంగ్లీని విచారించగా.. పార్టీ కోసం ఆమె ముందుస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపింది. అలాగే మద్యం వినియోగానికి కూడా ఎక్స్‌సైజ్ నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేవు. డీజే ఈవెంబట్ మేనేజర్ మేఘరాజు చేస్తున్నట్టు గుర్తించాం. అనుమతి లేకుండ పార్టీని నిర్వహించిన మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ పై కేసు నమోదు చేశాం. పోలీసుల ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీ, రిసార్ట్ ఓనర్‌పై కేసు నమోదు చేశాం. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీకి అనుమతి ఇచ్చిన త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ దామోదర్, ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్ పై కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Popular singer Mangli landed in a legal controversy as foreign #liquor and #Ganja were found at her birthday party held at a resort in #Chevella , outskirts of #Hyderabad
The police have booked a case against #Mangli and Resort General manager.
Reportedly Chevella Police… pic.twitter.com/hudTKBAbyR
— Surya Reddy (@jsuryareddy) June 11, 2025