Avika Gor: ప్రియుడిని నిశ్చితార్థం చేసుకున్న ‘చిన్నారి పెళ్లి కూతురు’ అవికా
Actress Avika Gor Engaged With Boyfriend Milind Chandwani: చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ‘అవికాగోర్’. అతి చిన్న వయసులో బుల్లితెరపైకి అడుపెట్టింది. చిన్నారి పెళ్లి కూతురులో ఆనంది పాత్రలో తనదైన నటనతో ఆడియన్స్ మన్ననలు అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా సత్తా చాటింది. తెలుగు చిత్రం ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ, లక్ష్మి రావే మా ఇంటికి వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది.
కెరీర్ తొలినాళ్లలో వరుస హిట్స్ దూసుకుపోయిన అవికా.. ఆ తర్వాత అదే స్థాయిలో రాణించలేకపోయింది. ఆమె సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద నిరాశ పరచడంతో తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అక్కడ అల్బమ్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటిస్తూ కెరీర్‌లో ముందుకు వెళుతుంది. తెలుగలోనూ ఆమె పలు సినిమాలు చేస్తుంది. అయితే గతంలో అవికా తన బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన సంగతి తెలిసింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం తను ప్రేమలో ఉన్నానంటూ ప్రియుడు మిలింద్ చంద్వానీ ప్రపంచానికి చూపించింది. ఎప్పుడో తన రిలేషన్‌ని ఆఫీషియల్ చేసిన అవికా.. అప్పుడే ఏడడుగులు వేస్తుందని అనుకున్నారు.
కానీ, పెళ్లి కాస్తా టైం తీసుకుని ఈ ఏడాది వైవాహిక బంధంలోకి అడుగుపట్టాలని నిర్ణయించుకుంది. తాజాగా ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించింది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరు రింగులు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అవికా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా మిలింద్‌తో ప్రేమ, పెళ్లి ప్రపోజల్ ఎలా జరిగిందో వివరించింది. “అతడు తన మనసులో మాట చెప్పగానే.. సంతోషంతో ఏడ్చేశాను. నా మనసులోనూ అదే ఉండటం.. అదీ అతడి నోటవెంట రావడంతో ఆనందం పట్టలేక గట్టిగా అరిచాను. నాది పూర్తిగా సినిమా బ్యాగ్రౌండ్ కావడంతో.. సినిమాటిక్ రేంజ్‌లో ఆ క్షణాలను ఊహించుకున్నాను. నా మైండ్ మొత్తం బీజీఎం వినిపిస్తోంది. స్లో మోషన్‌లో నా కల నెరవేరినట్టు కనిపిస్తోంది.
కానీ, అతడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ కనిపించకుండ తెలివిగా వ్యవహరించాడు. అయినా మేమిద్దరం జంటగా ఫిట్టయ్యాం. ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలిపోయాను. కళ్లనిండ నీళ్లు.. మెదడు ఆలోచించడమే మానేసినట్టు.. ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే కదా! అయినా ప్రేమలో అన్ని పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ, అందులో ఉన్న మ్యాజిక్కే వేరు” అంటూ రాసుకొచ్చింది. కాగా ముంబైకి చెందిన అవికా.. పదేళ్ల వయసులోనే యాక్టింగ్ ప్రారంభించింది. బాలికా వధు అనే హిందీ సీరియల్‌తో కెరీర్ మొదలైంది. ఇదే సీరియల్ భారత్‌లోని అన్ని భాషల్లో డబ్ అయ్యి దేశవ్యాప్తంగా ఆమె విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Thammudu Trailer:నువ్వు ఎప్పటికీ ఆవిడతో తమ్ముడు అనిపించుకోలేవు.. ఆకట్టుకుంటున్న నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్