Published On:

America GDP: యుద్ధం ఎఫెక్ట్..! క్షిణించిన అమెరికా ఆర్థిక వ్యవస్థ..!

America GDP: యుద్ధం ఎఫెక్ట్..! క్షిణించిన అమెరికా ఆర్థిక వ్యవస్థ..!

America growth rate down: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మందగించింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో పోల్చుకుంటే 0.5 శాతం క్షీణించింది. ముందుస్తు అంచనాల కంటే దారుణంగా క్షీణించింది. మూడేళ్ల తర్వాత ఈ స్థాయిలో అమెరికా జీడీపీ కుంగడం ఇదే మొదటిసారి. దీనికి కారణం.. దిగుమతులు పెరగడం .. ఎగుమతులు తగ్గడం… దీంతో పాటు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్ట్‌ ట్రంప్‌ పలు దేశాలతో ట్రేడ్‌ వార్‌కు దిగడంతో వినియోగదారులు విదేశీ వస్తువుల ధరలు పెరుగుతాయని భయపడి ముందస్తుగా పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పాల్పడ్డంతో ఈ ఏడాది మార్చితో ముగిసిన మొదటి త్రైమాసికంలో అమెరికా స్థూలదేశీయోత్పత్తి లేదా జీడీపీ గత ఏడాదితో పోల్చుకుంటే 0.5 శాతం కుంగింది.

 

అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధాల నుంచి కాస్తా విరామం తీసుకుని తిరిగి వ్యాపారాల వైపు దృష్టి మళ్లించింది. ఇరాన్‌ అణుప్లాంట్‌లపై బస్టర్‌ బాంబులు కురింపించి నానా హంగామా సృష్టంచిన ట్రంప్‌.. ప్రస్తుతం కాస్తా కూల్‌ అయ్యాడు. ఇప్పటి వరకు చైనా అంటే ఒంటికాలుపై లేచే అమెరికా ప్రెసిడెంట్‌ చైనాతో పాటు ఇండియాతో కూడా వాణిజ్య ఒప్పందాలకు సై అంటున్నాడు. దీంతో ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌కు ముగింపు పలికినట్లేనా.. చైనాతో ట్రేడ్‌ డీల్స్‌ కుదుర్చుకున్నాడు. త్వరలో ఇండియాతో కూడా ట్రేడ్‌ డీల్స్‌ కుదర్చుకుంటానంటున్నాడు.

 

ఇవి కూడా చదవండి: