Published On:

CM Revanth: హైదరాబాద్ ను న్యూయార్క్, టోక్యోతో పోటీ పడేలా చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth: హైదరాబాద్ ను న్యూయార్క్, టోక్యోతో పోటీ పడేలా చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, ట్యోక్యో వంటి నగరాలతో పోటీ పడేలా చేయాలన్నదే తమ తాపత్రయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్‌లో అనేక నాలాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయన్నారు.. హైడ్రా ద్వారా ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పారు. మా ప్రభుత్వానికి ఎన్నికలప్పుడే రాజకీయాలు అని.. మిగతా సమయాల్లో ప్రజల అభివృద్ధే బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నుంచి పాఠాలు నేర్చుకుని మనం ఒక ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

 

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చెన్నై, బెంగళూరు, ఏపీకి మెట్రో ఇచ్చారు.. తాము మెట్రో, మూసీ, ఆర్ఆర్ఆర్ అడిగితే కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన రేవంత్.. రాష్ట్రానికి మోదీ ఏమిచ్చారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రో పూర్తయితే హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారబోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి: