Published On:

CBSE 10,12th Results: సీబీఎస్సీ 10, 12 తరగతుల ఫలితాలపై క్లారిటీ!

CBSE 10,12th Results: సీబీఎస్సీ 10, 12 తరగతుల ఫలితాలపై క్లారిటీ!

CBSE 10, 12th Results: 10, 12వ తరగతుల పరీక్షా పలితాల తేదీని ఇంకా ప్రకటించలేదని సీబీఎస్సీ (CBSC)అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లేఖ ఫేక్ అని స్పష్టం చేసింది. మే2, 2025న ఫలితాల తేదీని వెళ్లడిస్తూ ఒక లెటర్ సర్క్యులేట్ అయింది. దీంతో 10, 12 తరగతుల రిజల్ట్ వస్తుందేమోనని విద్యార్థులు ఎదురుచూపులు మొదలెట్టారు.

 

పరిస్థితిని అర్థం చేసుకున్న సీబీఎస్సీ సదరు లేఖ ప్రామాణికమైనది కాదని, CBSE అధికారులు ఎవరూ జారీ చేయలేదని బోర్డు స్పష్టం చేసింది.

cbsc fake news alert

cbsc fake news alert

తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇతర భాగస్వాములు సహా అందరూ ప్రశాంతంగా ఉండాలని సీబీఎస్సీ అధికారులు కోరారు. బోర్టు ద్వారా దృవీకరించని లెటర్లను పట్టించుకోవద్దన్నారు.  ప్రతీ ఒక్కరు సీబీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. నకిలీ విషయాలను ప్రచారం చేయవద్దని హెచ్చరిక జారీచేశారు. ఫలితాల తేదీ విడుదల అయిందన్న సమాచారంతో విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధులు టెన్షన్ కు గురయ్యారు.

 

సోషల్ మీడియాను దుర్వినియోగం చేయవద్దని అధికారులు కోరారు. అసలు విషయాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే చూడాలని కోరారు.