Published On:

Salim Akhtar Passed Away: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Salim Akhtar Passed Away: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Bollywood Producer Salim Akhtar Passes Away: బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్(87) అర్దరాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీర్ భాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో అర్ధరాత్రి చికిత్స పొందుతూ కన్నుమూశారు.

 

ఇదిలా ఉండగా, సలీమ్ అక్తర్.. చాలామందిని స్టార్ హీరోయిన్లుగా మార్చారు. ముఖ్యంగా రాణీ ముఖర్జీ, తమన్నాలను ఇండస్ట్రీకి పరిచయం చేయగా.. ప్రస్తుతం వారు స్టార్ హీరోయిన్లుగా అన్ని భాషాల్లో రాణిస్తున్నారు. అలాగే, ఆయన బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తి తదితర స్టార్ హీరోలకు డైరెక్షన్ చేశారు.

 

సలీమ్ అక్తర్.. 1980, 1990 లలో వరుసగా ‘చారోన్ కీ బారాత్’, ‘లోహీ’, ‘ఖయామత్’, ‘పార్టీషన్’, ‘బాజీ’ వంటి సినిమాలు చేశారు. ఆయన షామా అక్తర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా, ఆయన అంత్యక్రియలు ఇవాళ జోహార్ ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ఇర్లా మసీదు వద్ద ఓ శ్మశానవాటిక జరగనున్నట్లు బంధువులు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి: