Published On:

Kartik Aaryan – Sreeleela Dating: శ్రీలీలతో ప్రేమ.. ఎట్టేకలకు నోరువిప్పిన కుర్ర హీరో!

Kartik Aaryan – Sreeleela Dating: శ్రీలీలతో ప్రేమ.. ఎట్టేకలకు నోరువిప్పిన కుర్ర హీరో!

Kartik Aaryan Revealed fact about Dating with Sreeleela: ఇండస్ట్రీలో పుకార్లు ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. ఒక సినిమా కోసం హీరోహీరోయిన్లు కలిసినా.. ఒక సినిమా హిట్ అయ్యాక ఆ జంట బయట కనిపించినా వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ నుకొందరు  ఖండిస్తారు. ఇంకొందరు ఖండించరు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తనపై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

 

గత కొన్నిరోజులుగా అందాల ముద్దుగుమ్మ శ్రీలీలతో కార్తీక్ ఆర్యన్ ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. పెళ్లి సందD సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన శ్రీలీల అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ఒక చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే డార్జిలింగ్ లో జరిగింది.

 

ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య పరిచయం ప్రేమగా మారిందని, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. శ్రీలీల తల్లి కూడా కార్తీక్ ఆర్యన్ గురించి మంచిగా మాట్లాడడం,  ఎప్పుడు కార్తీక్ ఆర్యన్ పక్కనే శ్రీలీల ఉండడం చూసి వీరి ప్రేమ వ్యవహారం నిజమే అని అనుకున్నారు. తాజాగా ఈ వార్తలకు కార్తీక్ ఆర్యన్ చెక్ పెట్టాడు. ఇండస్ట్రీలో తనకు  ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదని తేల్చి చెప్పాడు.

 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ ఆర్యన్ తనపై వస్తున్న రూమర్లపై ఫైర్ అయ్యాడు. “తాను ఒక్కో సినిమా రూ. 50 కోట్లు తీసుకుంటున్నాను అని రాస్తూన్నారు. ఇండస్ట్రీలో నేను ఒక్కడినేనా అంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాను. నాలా చాలామంది తీసుకుంటున్నారు. వారిని అడగరెందుకు. వారి గురించి రాయరు ఎందుకు.. ? ఎందుకంటే.. నాకు వెనుక నుంచి ఎలా సపోర్ట్ లేదు. నేను నెపో కిడ్ ను కాదు. నన్ను సపోర్ట్ చేయడానికి ఎవరు రారు అనే కదా.

 

ఇండస్ట్రీలో నాకు బ్రదర్, సిస్టర్, గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరు. అందుకే ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారు. ఇది నిజమని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అసత్యాలు ప్రచారం చేయడానికి కొందరు జనాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అవి నిజమో కాదో కూడా నిర్దారణ చేసుకోరు. ఇలాంటి వారి గురించి నేను పట్టించుకోను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీంతో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పడినట్టే…