Last Updated:

Aamir Khan: 60 ఏళ్ల వయస్సులో మూడో పెళ్లికి సిద్ధం.. ఆమెతో రిలేషన్ పై ఓపెన్ అయిన ఆమీర్ ఖాన్

Aamir Khan: 60 ఏళ్ల వయస్సులో మూడో పెళ్లికి సిద్ధం.. ఆమెతో రిలేషన్ పై ఓపెన్ అయిన ఆమీర్ ఖాన్

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎలాగో.. అక్కడ ఖాన్ త్రయం అలా అని చెప్పొచ్చు. ఇక మిస్టర్ కూల్  ఆమీర్ ఖాన్ సినిమా జీవితం ఎలా ఉన్నా ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడు వివాదాల్లోనే కొనసాగుతుంది. ఇప్పటికీ ఆమీర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

 

1986 లో ఆమీర్ కి రీనా దత్తాతో వివాహమైంది. ఆ తరువాత కిరణ్ రావును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక కొన్నేళ్లు అన్యోన్యంగా ఉన్న వీరు.. కొన్ని కారణాల వలన విడాకులు తీసుకున్నారు. అయితే వీరి విడాకులకు కారణం ఆమీర్ ఎఫైర్ అని వార్తలు వినిపించాయి. దంగల్ తో బాలీవుడ్ ను షేక్ చేసిన ఫాతిమా సనా షేక్ తో అమీర్ ఎఫైర్ పెట్టుకున్నాడని, ఇది తెలియడంతోనే కిరణ్ రావు విడాకులు తీసుకుందని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తరువాత క్లారిటీ వచ్చింది.

 

ఇక గత కొన్నిరోజులుగా ఆమీర్ ఖాన్ ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గౌరీ స్ప్రాట్ అనే యువతితో ఆమీర్ చాలాసార్లు కెమెరా కంటికి కనిపించాడు. ఇక మార్చి 14 న ఆమీర్ ఖాన్ పుట్టినరోజు కావడంతో మీడియతో మాట్లాడిన ఆయన మొదటిసారి తన డేటింగ్ వార్తలపై స్పందించాడు. రేపటితో ఆమీర్ కు 60 ఏళ్లు. ఈ వయస్సులో ఆయన తాను డేటింగ్ లో ఉన్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. తన స్నేహితురాలు అయిన గౌరీ స్ప్రాట్ తో తాను డేటింగ్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

 

” గౌరీ నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఆమెకు ఆరేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం. ప్రస్తుతం ఆమె బెంగుళూరులో నివసిస్తుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వార్తలు విన్న నెటిజన్స్ ఈ వయస్సులో మూడో పెళ్ళికి సిద్దమవుతున్నావా ఆమీర్ ఖాన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి వీరి బంధం డేటింగ్ తో ఆగిపోతుందో.. ? లేక పెళ్లి వరకు వెళ్తుందో చూడాలి.