Ranbir Kapoor: అలియా నా మొదటి భార్య కాదు.. నాకు ముందే ఆమెతో పెళ్లయింది

Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. యానిమల్ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అంతకుముందు విజయాపజయాలను పట్టించుకోకుండా కెరీర్ ను నెట్టుకొచ్చిన రణబీర్.. ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు భారీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం రణబీర్.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయిన రామాయణ్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత యానిమల్ పార్క్ సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక రణబీర్ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో సాఫీగా సాగుతుంది. రణబీర్ ఇండస్ట్రీకి వచ్చాక ఎంతోమంది హీరోయిన్స్ తో రిలేషన్ లో ఉన్నాడు. చివరికి తన మోస్ట్ లవబుల్ గర్ల్ ఫ్రెండ్ అలియా భట్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి రాహా అనే ముద్దుల కూతురు కూడా ఉంది. రాహా పుట్టాకా.. రణబీర్ లో చాలా మార్పు వచ్చింది. ఎక్కువ సమయం ఆమెతోనే గడపడం మొదలుపెట్టాడు.
ఇక బాలీవుడ్ లో రణబీర్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్.. రణబీర్ కు చాలామందే ఉన్నారు. అభిమానులు అంటే.. ఎప్పుడెప్పుడు తమ హీరోలను చూడాలా.. ? అని వారి ఇంటివద్దనే ఎదురుచూస్తూ ఉంటారు. ఇంకొంతమంది హీరోలను ప్రేమిస్తున్నామని, పెళ్లి చేసుకుంటామని పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు.
అలాంటి అభిమానుల్లో ఒక అమ్మాయి చేసిన పని తనకు ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని రణబీర్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ మాట్లాడుతూ.. ” ఈ ఘటన నేను కెరీర్ మొదలుపెట్టిన సమయంలో జరిగింది. ఒక అమ్మాయి నన్ను ఎంతో అభిమానించేది. ఒకసారి నేను ఇంట్లో లేని సమయంలో ఆమె మా ఇంటికి ఒక పురోహితుడుతో వచ్చి.. మా ఇంటి గేటును పెళ్లి చేసుకుందట.
గేటుకు పువ్వులు, బొట్టు పెట్టి.. పెళ్లి తంతు పూర్తి చేసింది. నేను వచ్చాకా మా వాచ్ మెన్ ఈ విషయం చెప్పాడు. నేను అది విని చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాను. ఆమె నా మొదటి భార్య. ఇప్పటివరకు నేను ఆమెను చూడలేదు. ఆమెను కలిసే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను” అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ మాటలు విన్న అభిమానులు.. ఆమె మీ మొదటి భార్య అయితే అలియా రెండో భార్యనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- Anaganaga Australia Lo Movie Review: విదేశాల్లోని యథార్థ సంఘటనల ఆధారంగా ‘అనగనగా ఆస్ట్రేలియాలో’ – సినిమా ఎలా ఉందంటే!