Last Updated:

RGV Tweet: ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్స్ పై ఆర్జీవీ సటైరికల్ ట్వీట్.. ఏమన్నారంటే..

RGV Tweet: ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్స్ పై ఆర్జీవీ సటైరికల్ ట్వీట్.. ఏమన్నారంటే..

RGV Comments on Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోతుంది. అయితే ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ కలెక్షన్స్ వివాదంగా మారాయి. ఫేక్ కలెక్షన్స్ ప్రకటించారంటూ మూవీ టీంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ కూడా గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పై సటైరికల్ గా కామెంట్స్. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన గేమ్ ఛేంజర్ ని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అబద్ధం కూడా నమ్మేలా ఉండాలి..

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ గేమ్ ఛేంజర్ బడ్జెట్, కలెక్షన్స్ పై సటైర్లు వేశాడు. ‘ఒకవేళ గేమ్ ఛేంజర్ మూవీ బడ్జెట్ రూ. 450 కోట్లు అయ్యింటే.. ఈ లెక్కన రాజమౌళి అద్భుతమైన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి రూ. 4500 కోట్లు ఖర్చు అయ్యుండాలి. అలాగే గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 186 కోట్లు వచ్చాయంటే.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు రూ. 1860 కోట్లు వచ్చి ఉండాలి. ఇక్కడ ఏదైనా నిజాన్ని నమ్మడానికి ప్రాథమిక సూత్రం నిజమని నమ్మదగినదిగా ఉండాదలి. అది అబద్దమైన కూడా నమ్మేలా ఉండాలి’ అంటూ తనదైన స్టైల్లో రాసుకొచ్చాడు.