Abhishek Bachchan: ఐశ్వర్యా రాయ్‌తో డివోర్స్.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదే..!

Abhishek Bachchan: గత కొంతకాలంగా బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడకులు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. అభిషేక్ ప్రధాన పాత్రలో నటించిన ఖాళిదర్ లాపతా అనే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని విడాకులపై జరుగుతున్న ప్రచారం రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా, ఆన్ లైన్ వేదికగా వచ్చే కామెంట్స్, రూమర్స్ తమపై ప్రభావం చూపవని ఆయన అన్నారు. ఎలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి.. ఎలాంటి విషయాలు వదిలేయాలి అనే దానిపై తన కంటూ ఓ అవగాహన ఉందన్నారు.
ముఖ్యంగా, బయటినుంచి వచ్చే వదంతులను అమ్మ, భార్య ఐశ్వర్యా మా ఇంటికి తీసుకురారని.. మేము అంతా బాగున్నామని అభిషేక్ తెలిపారు. తన కుమార్తె ఆరాధ్య విషయంలో ఎంతగానో సంతోషంగా ఉన్నామని.. ఆరాధ్య వ్యక్తిత్వానికి ఎలాంటి ఇబ్బంది కలిగించాలనుకోవడం లేదని పేర్కొన్నారు. తను అద్భుతమైన మహిళగా అభివృద్ధి చెందుతోందని.. ఆ క్రెడిట్ అంతా ఐశ్వర్యకే ఇస్తానని ప్రమోషన్స్ ఈవెంట్‌లో ప్రస్తావించారు.
అయితే ‘తనకు ఉన్నదంతా ఎంతో ఇష్టమైన వారికి ఇచ్చేశానని.. జన సమూహానికి దూరంగా ఉంటూ తనని తాను తెలుసుకోవాలనుకుంటున్నానని అభిషేక్ పోస్ట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ విడాకుల రూమర్స్ హల్‌చల్ చేశాయి. అవన్నీ రూమర్స్ అని పలు సందర్భాల్లో అభిషేక్ క్లారిటీ ఇచ్చినా.. ప్రచారం మాత్రం ఆగడం లేదు. దీంతో ఖాళిదర్ లాపతా అనే సినిమా ప్రమోషన్స్‌లో ప్రచారంపై స్పందించారు. ఈ రూమర్స్ వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ బాధ పడుతున్నారని.. వాటి గురించి నిజం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అభిషేక్ బచ్చన్ చెప్పారు.
అంతేకాకుండా 1995లో స్విట్జర్లాండ్‌లో తన తండ్రి నటించిన సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు ఐశ్వర్యను కలిశానని అభిషేక్ చెప్పారు. బాబీ డియోల్, ఐశ్వర్య ఓ సినిమా షూట్ కోసం అక్కడి వచ్చినప్పుడు మేమంతా కలిసి డిన్నర్‌కు వెళ్లామన్నారు. ఆ సమయంలో ఆమెతో చాలా విషయాలు మాట్లాడున్నామని ప్రమోషన్స్ ఈవెంట్‌లో తెలిపారు.