Published On:

Movies Release Dates War: ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ రచ్చ.. ఈసారైనా వస్తారా..?

Movies Release Dates War: ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ రచ్చ.. ఈసారైనా వస్తారా..?

Movies Release Dates War: ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ కోసం పెద్ధ యుద్ధమే జరుగుతోంది. మా సినిమా ఫలానా రోజు రిలీజ్ అవుతుందని నిర్మాతలు చెబుతున్నా.. అభిమానులు మాత్రం మాకు నమ్మకం లేదు దొర అంటున్నారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే.. కచ్చితంగా ఆన్ టైమ్ వచ్చేవాళ్లు మన హీరోలు.. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ప్యాన్ ఇండియన్ మత్తులో పడి చెప్పిన తేదీని మరిచిపోతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు చూస్తే.. హిట్ 3, సంక్రాంతికి వస్తున్నాం.. ఈ మూవీలు మాత్రమే చెప్పిన డేట్స్‌కి రిలీజ్ అయ్యాయి. మిగిలినవన్నీ బస్సులో సీట్ కోసం ఖర్చీఫ్ వేసినట్లు.. ఓ డేట్ అనౌన్స్ చేస్తున్నారు.

 

కానీ డేట్స్ దగ్గరికి వచ్చే సరికి రిలీజ్ అవుతున్నాయా.. అంటే లేదు. కనీసం చెప్పిన డేట్స్‌కి వచ్చేలా మేకర్స్ ప్రయత్నిస్తున్నారా.. అంటే తెలియదు. కానీ మరికొన్ని రోజుల్లో రిలీజ్ అనగా.. కొన్ని కారణాల వల్ల సినిమాని వాయిదా వేస్తున్నామని.. రిలీజ్ డేట్‌తో మళ్లీ కలుద్దామని మేకర్స్ అంటున్నారు. అయితే ఈసారి మాత్రం చాలా వరకు భారీ సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయిపోయాయి. సెప్టెంబర్ 25న అఖండ 2, ఓజి సినిమాను విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వంభర మూవీ రిలీజ్ కోసం ఓజి సినిమా వాయిదా వేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది.

 

అయితే మెగా స్టార్ చిరంజీవి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా డేట్‌ను మార్చుకున్నారని ఫ్యాన్స్ గుసగుసలాడుతున్నారు. ఈ క్రమంలో డివివి ఎంటర్‌టైన్మెంట్స్ ఓ ట్వీట్ చేసింది. అలాంటిదేం లేదని.. రూమర్స్ నమ్మకండి అంటూ చెప్పి.. చెప్పనట్లు చెప్పింది. దీంతో మూవీ డేట్స్‌పై కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఘాటీ సినిమా జులై 11న రిలీజ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడినట్లు సమాచారం. ఇక మాస్ జాతర, మిరాయ్ సినిమాలకు తేదీ ఫిక్స్ అయినా.. మేకర్స్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. మరోవైపు కింగ్డమ్ సినిమా డేట్ కూడా లాక్ అవ్వలేదు. దీంతో ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్‌పై రచ్చ‌ జరుగుతోంది.

 

 

ఇవి కూడా చదవండి: