Actor Tushar: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు సూసైడ్!

Marathi actor Tushar Ghadigaonkar suicide: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ నటుడు తుషార్ ఘడిగాంకర్ ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లోని తన అద్దె ఫ్లాట్‌లో స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అతడిని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రంగుల ప్రపంచంలో రాణించాలనుకుని ఇండస్ట్రీకి వచ్చిన తుషార్‌కు పెద్దగా అవకాశాలు దొరక్కపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది.
అయితే. గత కొంతకాలంగా సినిమా అవకాశాలు రాకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమయంలోనే మద్యానికి అలవాటై ఆలోచనలో పడ్డట్లు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాను సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తొలుత నటుడు చనిపోయిన విషయాన్ని మిత్రుడు అంకుర్ విఠల్ రావ్ తెలిపాడు.
ఇక, తుషార్.. మరాఠి సినిమాల్లో యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా టీవీ, నాటక రంగాల్లోనూ నటించాడు. సొంత బయానర్ ఘంటా నాథ్ ప్రొడక్షన్ కింద మ్యూజిక్ వీడియో రంగంలోనూ పాత్ర పోషించాడు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.