Published On:

Jurassic World Rebirth: దిమ్మతిరిగేలా జురాసిక్ వరల్డ్ రీ బర్త్ కలెక్షన్స్.. వేరే లేవెల్‌లో బుకింగ్స్..!

Jurassic World Rebirth: దిమ్మతిరిగేలా జురాసిక్ వరల్డ్ రీ బర్త్ కలెక్షన్స్.. వేరే లేవెల్‌లో బుకింగ్స్..!

Jurassic World Rebirth: తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న జురాసిక్ వరల్డ్ సిరీస్‌లోని నాలుగో సినిమా విడుదలైంది. గ్యారెత్ ఎడ్వార్డ్స్ డైరెక్షన్‌లో జూరాసిక్ వరల్డ్ రీ బర్త్ అనే మూవీని రూపొందించారు. ఈ సినిమాలో మహెర్షాలా ఆలీ, ఎడ్ స్క్రేన్, రూపర్ట్ ఫ్రెండ్, స్కార్లెట్ జాన్సన్, పలువురు సినీ నటులు కీలక పాత్రల్లో నటించారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన జూరాసిక్ వరల్డ్ రీ బర్త్ భారీ వసూళ్లు రాబడుతోంది.

 

జురాసిక్ వరల్డ్‌ను ఫ్రాంచైజీల్లో ఏడో మూవీగా రూపోందించారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ మూవీని తీయడానికి సుమారు 180 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. అంటే మన భారత కరెన్సీలో 1550 కోట్ల రూపాయలన్నమాట. ప్రస్తుతం జూరాసిక్ వరల్డ్ రీ బర్త్ సినిమా 70 దేశాల్లో విడుదలైంది. చైనా, ఆస్ట్రేలియా, కొరియా, నార్త్ అమెరికా, గల్ఫ్, సింగపూర్, మలేషియా, స్పెయిన్, తదితర దేశాల్లో విడుదలైంది.

 

పలు దేశాల్లో జూలై 3నే మూవీ ప్రీమియర్లు మొదలయ్యాయి. ఆ రోజు ఈ మూవీ సుమారు 22 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే 105 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే భారత్ కరెన్సీలో 9000 కోట్ల రూపాయలు అని అర్థం. అయితే ఈ జూరాసిక్ వరల్డ్ రీ బర్త్ మూవీకి నార్త్ ఇండియాలో మంచి ఆదరణ లభించింది. హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, తదితర నగరాల్లో తొలి రోజే 9 కోట్ల నెట్ కలెక్షన్లు, 18 కోట్ల రూపాయల గ్రాస్‌ వసూళ్లు చేసింది.

 

ఇక ఇంగ్లీష్‌లో 5 కోట్ల రూపాయలు, హిందీలో 2.5 కోట్ల రూపాయలు, తమిళంలో కోటి రూపాయలు, తెలుగు 18 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని సాక్ నిల్క్ తెలిపారు. అయితే ఈ సినిమా రిలీజ్‌ కాకముందు చాలా సందేహాలు వచ్చాయి. దీంతో జూరాసిక్ వరల్డ్ సిరీస్‌‌లో కొత్తగా వచ్చిన జూరాసిక్ వరల్డ్ రీ బర్త్ మూవీని పెద్దగా అంచనాలు లేకుండా విడుదల చేశారు. జూరాసిక్ వరల్డ్ సినిమా 2015లో విడుదల కాగా.. సినిమాకు అనూహ్యమైన స్పందన వచ్చింది.

 

ఈ జూరాసిక్ వరల్డ్ కంటే ముందు 1993లో జూరాసిక్ పార్క్ అనే మూవీని స్టీవెన్ స్పీల్ బెర్గ్ డైరెక్షన్‌లో రిలీజ్‌ చేయగా సంచలనం సృష్టించింది. దీంతో జూరాసిక్ పార్క్ సీక్వెల్‌గా 1998లో జూరాసిక్ పార్క్ ది లాస్ట్ వరల్డ్ అనే సినిమాను విడుదల చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ కొట్టింది. కానీ 2001లో విడుదల చేసిన జూరాసిక్ పార్క్ 3 మూవీ మాత్రం ఫెయిల్ అయింది.

 

మళ్లీ పదిహేనేళ్ల తరువాత ఈ జూరాసిక్ వరల్డ్ అనే కొత్త సిరీస్‌తో సినిమాను రిలీజ్ చేశారు. ఆ సినిమాకి మంచి స్పందన లభించడంతో ఫాలెన్ కింగ్ డమ్, డొమినియన్ అనే రెండు సినిమాలను విడుదల చేశారు. కానీ ఈ రెండు సినిమాలపై రూమర్స్ వచ్చాయి. ఇక చివరి ప్రయత్నంగా నిన్న జూరాసిక్ వరల్డ్ రీ బర్త్ మూవీని రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా భారీ హిట్ కొడుతుందో.. లేదో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: