Sankranthiki Vasthunam Review: ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ.. అనిల్ రావిపూడి, వెంకటేష్ సినిమా ఎలా ఉందంటే..
Sankranthiki Vasthunnam Movie Review In Telugu: ‘సంక్రాంతికి వస్తున్నామం’ అంటూ ఈ సంక్రాంతి పండుగకు థియేటర్ సందడి చేసేందుకు వచ్చేసాడు విక్టరీ వెంకటేష్. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటాయి వెంకీమామ సినిమా అంటే. దానికి తోడు అనిరావిపూడీతో కాంబో అంటే ఇక ఆ సినిమాలో కామెడీకి కొదువే ఉండదు. ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్3లతో వీరి కాంబో ఎంతగా ఆదరణ పొందిందో చూశాం. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలకు అనిల్ రావిపూడీ కేరాఫ్ అడ్రస్.
అలాగే ఇంతవరకు ప్లాప్ చూడని అనిల్ రావిపూడి ఈసారి వెంకటేష్ కాంబోలో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ఈ సంక్రాంతికి వచ్చారు. ఇక ప్రమోషన్స్ విషయంలో అనిల్ రావిపూడి ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా డిజిటల్ ప్రమోషన్స్ చేశాడు. ప్రతి కార్యక్రమానికి హాజరై ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాను ప్రమోట్ చేశాడు. ప్రమోషనల్ కార్యక్రమాల్లోనే సినిమా కథేంటి? అనేది రివీల్ చేశారు. ఆడియో కూడా బాగా హిట్ అవ్వడంతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అలా అంచనాల మధ్య జనవరి 14న విడుదలైన ‘సంక్రాంతి వస్తున్నాం’ ఆడియన్స్ మెప్పించిందా, ఊహించినట్టుగా ప్రేక్షకులను నవ్వించిందా లేదా ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
అమెరికాలోని ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో సత్యా ఆకెళ్ళ (అవసరాల శ్రీనివాస్) హైదరాబాద్ వస్తాడు. ఈ సందర్భంగా సీఎం కేశవ(నరేష్), పార్టీ ప్రెసిడెంట్ (వీటీవీ గణేష్) ఆయనను కలుస్తారు. ఫాం హౌజ్ పార్టీ చేస్తున్నామని సత్యా ఆకెళ్ళను ఆహ్వానిస్తారు. దీంతో ఆ పార్టీకి వెళ్లిన సత్యా కిడ్నాప్ గురవుతాడు. జైల్లో ఉన్న కరుడు గట్టిన రౌడీ తమ్ముడు తన అన్నయ్యను విడిపించుకునేందుకు సీఈవో సత్యను కిడ్నాప్ చేస్తాడు. దీంతో బయటకు ఈ విషయం తెలియకుండ గుట్టుచప్పుడు కాకుండా కిడ్నాపర్ల చేర నుంచి ఆయనను రక్షించాలని సీఎం కేశవ, పోలీస్ ఆఫీసర్ మీనాక్షి(మీనాక్షి చౌదరి)తో సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేస్తారు. ఈ ఆపరేషన్ ఓ ధైర్యవంతుడైన పోలీసుల ఆఫీసర్ కావాలని వేతుకుతున్న మీనాక్షి తన మాజీ ప్రియుడు యాదగిరి దామోదర్ రాజు(హీరో వెంకటేష్) సాయం అడుగుతుంది. ఆయన మాజీ ఐపీఎస్ అధికారి. 150 ఎన్ కౌంటర్ చేసిన హిస్టరీ ఆయనది. పెళ్లి తర్వాత దామోదర్ రాజు పోలీసు జాబ్ వదిలేసి అత్తారింట్లో భార్య భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్), నలుగురు పిల్లలతో కలిసి హ్యాపీగా రాజమండ్రిలో సెటిలైపోతాడు. ఈ ఆపరేషన్ కోసం మాజీ ప్రేయసి మీనాక్షి అతడిని కలిసి అసలు విషయం చెప్పి సాయం చేసేందుకు ఒప్పిస్తుంది. అయితే వచ్చింది తన భర్త మాజీ ప్రేయసి అని తెలిసి ఉడుక్కుంటుంది భాగ్యలక్ష్మి. సత్య విడిపించే ఆపరేషన్ కి తన భర్తతో పాటు తాను వస్తానని చెబుతుంది. అలా ముగ్గురు కలిసి ఈ ఆపరేషన్ కు వెళతారు. ఈ క్రమంలో వారి ఎదురైన పరిణామాలు? ఇంతకి ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా? అసలేం జరిగిందనేది మిగతా కథ.
విశ్లేషణ (Sankranthiki Vasthunam Review Telugu):
అనిల్ రావిపూడి సినిమా అంటే ట్విస్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండవు. అయినా ఆయన సినిమా చూసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతారు. ఎంత సీరియస్ కథ అయినా తనదైన స్టైల్లో నవ్విస్తూ నడిపిస్తాడు. ఈ క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వించడమే కాదు, బాగా ఆకట్టుకుంటాయి కూడా. తన కామెడీ సీన్ లో ఓ సిగ్నేచర్ మార్క్ ఉంటుంది. దాంతో అనిల్ రావిపూడి డైరెక్షన్ అంటే కాసేపు నవ్వుకోవచ్చనే ఆడియన్స్ అంతా మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళతారు. అవే అంచనాలు ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ థియేటర్ లోకి వచ్చింది. ప్రతి ఒక్కడి మగాడి జీవితంలో పెళ్లికి ముందు ప్రియురాలు ఉంటుంది, ఆ కథ భార్యకు తెలిస్తే.. కొన్ని రోజులు ప్రియురాలు కలిస్తే ఆ మగాడి జీవితం ఎలా ఉంటుందనేది ఈ సినిమా అసలు కథ. దీనికి అనిల్ రావిపై కిడ్నాప్ ఎపిసోడ్ ని పెట్టి పెళ్లయిన వ్యక్తి జీవితంలోకి ప్రియురాలిని తీసుకువస్తాడు. అమెరికా నుంచి బడా వ్యాపారవేత్త హైదరాబాద్ రావడం, సీఎం పార్టీలో అతడు కిడ్నాప్ గురికావడం, ఇందులో సమర్థవంతమైన పోలీసు ఆఫీసర్ ని వెతకడం.. ఆ తర్వాత మీనాక్షి, వెంకటేష్ ని కలవడం తొలి 20 నిమిషాలు కథ అంతా ఇదే జరుగుతుంది.
ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కథపై ఆసక్తి పెంచాయి. మీనాక్షి, వెంకటేషన్ కలవడం, వీరిద్దరు మాజీ ప్రియులని ఆయన భార్య ఐశ్వర్య రాజేష్, ఆమె కుటుంబ సభ్యులకు తెలియడం వంటి సన్నివేశాలు నవ్వించాయి. ఇద్దరు విడిపోయేటప్పుడు తన కోసమే ఎన్ని ఏళ్లయినా వెయిట్ చేస్తానని చెప్పి ప్రియుడు ఇప్పుడు పెళ్లై నలుగురు పిల్లల తండ్రి అని తెలిసి మీనాక్షి చౌదరి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ బాగా నవ్విస్తుంది. ఆ తర్వాత జలసీగా ఫీల్ అయ్యే భార్య, ఇంట్లో పిల్లలతో ఎదురయ్యే సరదా సంభాషణ, ఇంట్లో అత్తామామ నుంచి అతడి ఎదురయ్యే సరదా సమస్యలతో వినోదాత్మకంగా సాగుతుంది. ముఖ్యంగా మధ్యలో హీరో కొడకు బుల్లిరాజు కామెడీ ట్రాక్ మూవీకి హైలెట్. గోదారోళ్లలో పిల్లలు యాస, పెద్దలతో చమత్కారంగా సైటర్లు వేసే మాట తీరు ఈ బుల్లిరాజు క్యారెక్టర్ తో చూపించాడు అనిల్ రావిపూడి. ఈ క్యారెక్టర్ బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలో బాగా నవ్వించే ఎపిసోడ్ అంటే బుల్లిరాజుదే అని చెప్పాలి. అలా వినోదాత్మకంగా సాగిన ఫస్టాఫ్ ఇంటర్వెల్ కి ముందు చిన్న మెలికి పెట్టి ఆ రెస్క్చూ ఆపరేషన్ కు భాగ్యం వెళతాను అనడం, ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు సెకండాఫ్ పై ఆసక్తి పెంచాయి.
ఎవరెలా చేశారంటే..
గతంలో వెంకటేష్ ఎన్నో పోలీసు ఆఫీసర్ పాత్రలు చేశారు. అనిల్ రావిపూడి రాసిన క్యారెక్టరైజేషన్ కూడా ఆయనకు కొత్త కాదు. ఈసారి మాజీ పోలీసు ఆఫీసర్ గా వెంకిమామ కనువిందు చేశారు. ఓ వైపు భార్యను అమితంగా ప్రేమించే భర్తగా.. మరోవైపు లవర్ బాయ్ గా, ఇంకోవైపు సిన్సీయర్ పోలీసుల ఆఫీసర్ గా త్రి షేడ్స్ లో తనదైన కామెడీ పండిస్తూ వెంకిమామ ఈ సినిమాను ముందుకు నడిపించారని చెప్పాలి. మహిళా పోలీసుల ఆఫీసర్ గా, మాజీ ప్రియురాలుగి మీనాక్షి చౌదరి చాలా బాగా నటించింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అలాగే జలసీ ఫీల్ అయ్యే భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఒదిగిపోయింది. ఆమె పాత్ర చాలా సహాజంగా కనిపించింది.
బలాలు
కథ, కథనం
వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షిల కామెడీ
పాటలు
బలహీనతలు
ఊహకు తగ్గట్టుగా సాగే కథ
బోరింగ్ గా సాగిన సెకండాఫ్
రేటింగ్ : 3.5/5