Samantha @Tana 2025: తెలుగు ఫ్యాన్స్ గురించే ఆలోచిస్తా.. స్టేజీపై సమంత ఎమోషనల్

Samantha Emotional at TANA Conference 2025: సౌత్ బ్యూటీ, టాప్ హీరోయిన్ సమంత అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు సినీ పరిశ్రమతో పాటు తమిళ్ వంటి పరిశ్రమల్లోనూ ఆకట్టుకుంటుంది. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచియమైన ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్లింది. ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోలతో నటించి తనకంటూ స్పెషల్ ఫేమ్ క్రియేట్ చేసుకుంది.
అయితే, గతంలో మయోసైటిస్ వ్యాధితో ఫ్యాన్స్‌కు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమా పరిశ్రమల్లో కోలుకుంటున్నారు. సోషల్ మీడియాలో నిరంతరం ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటారు. మయోసైటిస్ వ్యాధి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. శుభం సినిమాతో మరోసారి ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ జోష్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకున్నారు.
తాజాగా, అమెరికాలో జరిగిన TATA – 2025 కాన్ఫరెన్స్‌లో హీరోయిన్ సమంత ఎమోషనల్ అయ్యారు. TATA గురించి ప్రతి ఏడాది వింటూనే ఉంటానన్నారు. తొలి సినిమా నుంచి నాపై మీరంతా అమితమైన ప్రేమను పంచుతున్నారు. మీరు ప్రేమ చూపించడంతోనే ఈ గుర్తింపు లభించిందన్నారు. అంతేకాకుండా నేను ఏ భాషలో ఏ సినిమా చేసినా ముందుగా తెలుగు ఫ్యాన్స్ గురించే ఆలోచిస్తానని ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే ఈ గుర్తింపు తెచ్చింది మీరేనని, నా ఫ్యాన్స్ భౌగోళికంగా ఎంత దూరం ఉన్నప్పటికీ ఎప్పుడూ నా హృదయంలో ఉంటారని సమంత కన్నీళ్లతో తన ప్రసంగాన్ని ముగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.