Game Changer Editor: ‘గేమ్ ఛేంజర్‌కు పని చేయడం ఓ చేదు అనుభవం.. డైరెక్టర్‌పై ఎడిటల్ సమీర్ విమర్శలు

Game Changer Editor Shameer Sensational Comments on Shankar: గేమ్ ఛేంజర్ మూవీకి పని చేయడం ఓ ఛేదు అనుభవవం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఎడిటర్ షమీర్ మహమ్మద్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి విడుదలైన ఆశించిన స్థాయిలో మెప్పించలేకోపోయింది. బాక్సాఫీసు వద్ద దారుణమైన కలెక్షన్స్ రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. గ్లోబర్ స్టార్ రేంజ్ మూవీ ఇది కాదనే విమర్శలు కూడా వచ్చాయి.
అయితే మూవీ పరాజయంపై దర్శక-నిర్మాతలు స్పందిస్తూ.. మూవీ అనుకున్న స్థాయిలో చూపించలేకపోయమన్నారు. గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్ ఎంతో చెప్పాలనుకున్నానని, దానిని మూడు గంటల్లో చెప్పే ప్రయత్నంలో విఫలమయ్యామన్నారు. తాజాగా ఇదే విషయంపై గేమ్ ఛేంజర్ ఎడిటర్ షమీర్ మహమ్మద్ స్పందించారు. ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో గేమ్ ఛేంజర్ నుంచి తాను తప్పుకోవడానికి కారణాన్ని వివరించారు. ఈ క్రమంలో డైరెక్టర్ శంకర్‌పై ఆయన విమర్శలు గుప్పించాడు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “డైరెక్టర్ శంకర్‌తో పని చేయడం నా జీవితంలో ఓ చేదు అనుభవం. ఆయన పని చేయడం దారుణంగా అనిపించింది. గేమ్ ఛేంజర్‌కి ఎడిటర్ నాకు అవకాశం రాగానే ఎంతో ఉత్సాహంతో అక్కడి వెళ్లాను. శంకర్ సినిమా అంటే ఓ రేంజ్‌లో ఊహించుకున్న. కానీ నాకు అక్కడికి వెళ్లాక అంత భిన్నంగా ఉందని అనిపించింది. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది వరకు పని చేశారు. మొదట ఆరు నెలలు అని చెప్పారు. వెళ్లాక మరో నెల ఉండాల్సి ఉంటుందని చెప్పారు.
నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సినిమా నిడివి ఏడు గంటల నుంచి 7:30 గంటల వరకు ఉంది. దానిని మూడున్నర గంటలకు కుదించాను. ఆ తర్వాత మరో కొత్త ఎడిటర్ వచ్చి దానిని రెండున్న నుంచి 3 గంటలకు తగ్గించాడు. మూవీ ఎడిటింగ్ కోసం డైరెక్టర్ శంకర్ ఒక తేదీని నిర్ణయించేవారు. కానీ ఆ తేదీ కాకుండ పది రోజుల తర్వాత వచ్చేవారు. అదే పద్దతి చాలా రోజులు కొనసాగింది. ఆయన తీరు నాకు చాలా విసుగు తెప్పించింది. ఎలాగోలా గేమ్ ఛేంజర్ కోసం 300 నుంచి 350 రోజులు పని చేశారు. అప్పుడు చెన్నైలోనే ఉన్నా. డైరెక్టర్ తీరు, అక్కడ పని వాతావరణం నచ్చక గేమ్ ఛేంజర్‌ను మధ్యలోనే వదిలేసి రావాల్సి వచ్చింది” అని షమీర్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం అతడి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. స్టార్ డైరెక్టర్ విమర్శించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దీనిపై మెగా అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. డైరెక్టర్ నిర్లక్ష్యం వల్లే గేమ్ ఛేంజర్ మూవీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని, తమ హీరోకి ప్లాప్ ఇచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా షమీర్ తప్పుకున్న తర్వాత గేమ్ ఛేంజర్‌కు ఎడిటర్‌గా రూబెన్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే.