Published On:

Priyanka Chopra Rejected Allu Arjun Movie: అల్లు అర్జున్‌ సినిమాను రిజెక్ట్‌ చేసిన గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా.. కారణమేంటంటే..?

Priyanka Chopra Rejected Allu Arjun Movie: అల్లు అర్జున్‌ సినిమాను రిజెక్ట్‌ చేసిన గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా.. కారణమేంటంటే..?

Priyanka Chopra Rejected Allu Arjun Movie Offer: పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. అదే రేంజ్‌లోనే ఆయన సినిమాలను ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో హిట్‌ డైరెక్టర్‌ అట్లీతో అల్లు అర్జున్‌ జతకట్టబోతున్నట్టు తెలిసిందే. ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అల్లు అర్జున్‌ 22వ సినిమాగా ఇది రూపొందనుంది. సోషియో ఫాంటసీగా, అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్‌-మైత్రీ మూవీ మేకర్స్‌ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

 

AA22 కోసం భారీ బడ్జెట్‌

దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో ఇది ప్లాన్‌ చేస్తున్నట్టు ప్రచారం కూడా మొదలైంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కాగా.. గ్రాండ్‌ లాంచ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఇది పాన్‌ ఇండియా సినిమా కాబట్టి.. హీరోయిన్‌ రేంజ్‌ కూడా అదే స్థాయిలో ఉండేలా చూస్తోందట మూవీ టీం. ఇందుకోసం గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాను సంప్రదించినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు ప్రియాంక నో చెప్పింది. ప్రస్తుతం ఆమె రాజమౌళి-మహేష్‌ బాబు SSMB29 సినిమాలో నటిస్తోంది. జక్కన్న సినిమా అంటే ఎప్పుడు షూటింగ్‌ ఉంటుంది, ఎప్పుడు బ్రేక్‌ దొరుకుతుందో చెప్పలేం. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ప్రతి నటీనటుడు నిబద్ధతతో ఉండాలి.

 

SSMB29, క్రిష్4కి గ్రీన్ సిగ్నల్

మరోవైపు ఇటీవల బాలీవుడ్‌ హిట్‌ మూవీ క్రిష్‌ 4కి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తన స్నేహితుడు హ్రుతిక్‌ రోషన్ అడగడంతో ఆమె కాదనలేకపోయిందని, ఈ సినిమా నటించేందుకు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. నిన్నే వీరిద్దరు సమావేశం కూడా అయ్యారు. మరోవైపు హాలీవుడ్‌లో రెండు సిరీస్‌లో చేస్తున్న ప్రియాంక ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉందట. అందుకే బన్నీ సినిమాకు డేట్స్‌ కుదరకపోవడంతో చేయనని చెప్పినట్టు ఫిలిం దునియాలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు కియారాని తీసుకుందామంటే ఆమె ప్రెగ్నెంట్‌ అనే విషయం తెలిసిందే. ఇక దీపికాని తీసుకుందామంటే.. ఇటీవల తల్లయిన ఆమె ఇంకా సినిమాలు మొదలుపెట్టలేదు. దీంతో బన్నీ-అట్లీ సినిమాకు హీరోయిన్‌ దొరకడం కష్టంగా ఉందంటున్నారు.

 

సమంత ప్లస్ అయ్యేనా..?

అయితే ఇటీవల సమంత పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. సిటాడెల్‌: హానీ-బన్నీతో ఆమె పాన్‌ స్థాయిలో గుర్తింపు పొందింది. అలాగే ఆమెకు హిందీలో మంచి క్రేజ్‌ ఉంది. మరోవైపు బన్నీతో కలిసి నటించిన అనుభవం, అట్లీతో మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉండటంతో సమంతను ఈ సినిమాకు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం సామ్‌ మార్కెట్‌ ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. పైగా తరచూ ఆమె అనారోగ్యం బారిన పడుతుంది. ఇలాంటి టైంలో సమంత ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌కి ప్లస్‌ అవుతుందా? అనే సందేహంలో పడ్డారట మేకర్స్‌. పైగా ఈ టైంలో సమంతను తీసుకోవడమంటే సాహసమనే అనుకుంటున్నారు. మరి అట్లీ-బన్నీ సినిమాకు హీరోయిన్‌ దొరుకుతుందా? లేదా? అనేది కొద్ది రోజులు వేయిట్‌ చేయాల్సిందే.