Sarangapani Jathakam Movie: మళ్లీ వాయిదా పడ్డ సారంగపాణి జాతకం – కారణమేంటంటే!

Sarangapani Jathakam Postponed Again: నటుడు ప్రియదర్శి ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. కమెడియన్‌గా, హీరోలకు ఫ్రెండ్ వంటి సైడ్ క్యారెక్టర్లు చేసిన ప్రియదర్శి మల్లేశం వంటి చిత్రంలో లీడ్ యాక్టర్‌గా కనిపించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన ప్రియదర్శి బలగం, డార్లింగ్, మంగళవారం, కోర్ట్ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ అనే చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
సారంగపాణి జాతకం మళ్లీ వాయిదా
గతేడాది విడుదల కావాల్సి ఈ సినిమా తరచూ వాయిదా పడుతోంది. ఇక ఎట్టకేలకు ఈ నెల 18న విడుదలకు సిద్దమైన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు సారంగపాణి జాతకం థియేటర్లోకి వస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 18న విడుదల కావాల్సిన ఈ సినిమా మరో వారం వెనక్కి వెళ్లింది. ఏప్రిల్ 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు మూవీ టీం వెల్లడిచింది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో నిర్మాత శివలెంక ప్రసాద్ మాట్లాడారు. “ఏప్రిల్ 18న విడుదల చేయాల్సిన మా సినిమాను బయ్యర్ల సూచన మేరకు మరిన్ని మంచి థియేటర్ల లభ్యత కోసం 25న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే సారంగపాణి జాతకం సినిమాను వాయిదా వేస్తున్నాం” అని తెలిపారు.
అదే కారణమా?
కాగా ఏప్రిల్ పలు పెద్ద సినిమాలు విడుదల ఉండటంతో థియేటర్ల కొరత కారణంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 17న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అర్జున్ S/O వైజయంతి’, తమన్నా ‘ఓదెల 2’ పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. దీంతో సారంగపాణి జాతకం చిత్రానికి అనుకున్నని థియేటర్లు దొరక్కపోవడం సినిమాను వాయిదా వేయక తప్పలేదు. కాగా జెంటిల్‌మెన్, సమ్మోహనం వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. పైగా మంగళవారం, 35 చిన్న కథ కాదు, కోర్ట్ వంటి చిత్రాలతో ప్రియదర్శి క్రేజ్ కూడా పెరిగిపోయింది. దీంతో సారంగపాణి జాతకం మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలింగ కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన రూప కుడువాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది.