Last Updated:

Ustaad Bhagath Singh : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయే అప్డేట్.. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగమనం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ 2024లో రిలీజ్ కానుంది. దాదాపు పది సంవత్సరాల క్రితం

Ustaad Bhagath Singh : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయే అప్డేట్.. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగమనం

Ustaad Bhagath Singh :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ 2024లో రిలీజ్ కానుంది. దాదాపు పది సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ని ఈరోజు(11 మే) సాయంత్రం 4.59 కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ గ్లింప్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ వారికి డబుల్ బొనాంజా అందిస్తూ తాజాగా మరో అప్డేట్ తో అభిమానులకు పిచ్చెక్కించారు మూవీ టీం.

తాజాగా సర్ ప్రైజ్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఈ లుక్ లో చాలా స్టైలిష్ గా నించొని కనిపించాడు. ఈ పోస్టర్ లో పోలీసుల బారికేడ్లు.. పోలీసులతో పాటు సామాన్య ప్రజలు నిలబడి ఉన్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ ను అదిరిపోయే పోలీస్ లుక్ లో చూపించాడు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ లో చాలా స్టైలీష్ గా చూపిస్తాడని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో పోలీస్ లుక్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఉస్తాద్ అనే పాత్రతో పాటు భగత్ సింగ్ అనే మరో పాత్ర కలుపుకుని డ్యూయల్ రోల్స్ కాని.. డ్యూయల్ క్యారెక్టర్ ఒక్కడే చేయడం లాంటి ట్విస్ట్ లు ఉన్నాయి.

 

 

తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తర్వాత టైటిల్ ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం పట్టాలెక్కడం ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఓ వైపు షూటింగ్, మరోవైపు ఎడిటింగ్, మ్యూజిక్ వర్క్ ప్రారంభించి స్పీడ్ పెంచారు.

అదే విధంగా పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు, సుజిత్ తో #OG, సాయి తేజ్ తో కలిసి చేస్తున్న వినోదాయ సిత్తం ఉన్నాయి.  కాగా రాజకీయాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి పవన్ ఇప్పుడు ఈ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల సాయి తేజ్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 2024 ఎలక్షన్స్ లోపు ఈ చిత్రాలన్నీ ముగించేయాలని పవన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. పవన్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ షూట్స్ లో బిజీగా ఉన్నాడు.