Published On:

Paradise: నాని సరసన డ్రాగన్ భామ.. ఎట్టకేలకు లక్కీ ఛాన్స్ పట్టేసిందిగా.. ?

Paradise: నాని సరసన డ్రాగన్ భామ.. ఎట్టకేలకు లక్కీ ఛాన్స్ పట్టేసిందిగా.. ?

Paradise: న్యాచురల్ స్టార్ నాని.. హిట్ 3 తో భారీ హిట్ ను అందుకున్నాడు. వైలెన్స్,  కథ లేదు.. అని పెదవి విరిచినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాను రూ. 100 కోట్ల క్లబ్ లో  చేర్చేసారు. ఇక ఈ సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాని, శ్రీకాంత్ కాంబోలో వచ్చిన దసరా సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

 

ఇక దానికి మించి ప్యారడైజ్ ను తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నాని లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక ఈ సినిమాలో నాని తల్లిగా ఎవరు నటించబోతున్నారు అనేది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్ లో లం* కొడుకు అంటూ చేతిపై పచ్చబొట్టు ఉన్నట్లు చూపించడంతో అంత ఇంపాక్ట్ ఉన్న పాత్రలో ఇంకెంత పవర్ ఫుల్ లేడీ కనిపిస్తుందో అని చూస్తున్నారు.

 

రమ్యకృష్ణ ఆ పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక నిజమైతే ఆమె కాకుండా ఇంకెవరు ఆ పాత్రలో నటించలేరు అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ కాకుండా నాని సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది పెద్ద చర్చ గా మారింది. ఇప్పటికే నాని సరసన రష్మిక, శ్రీలీల నటిస్తున్నారని అన్నారు. కానీ, చివరకు కయాదు లోహర్ దగ్గరకు వచ్చి ఆగిందని సమాచారం. శ్రీవిష్ణు నటించిన అల్లూరి సినిమాతో కయాదు లోహర్ తో తెలుగుతెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో అమ్మడి గురించి ఎవరూ పట్టించుకోలేదు.

 

ఇక ఎప్పుడైతే ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీతో ఈ చిన్నది సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్న ఫంకీ సినిమాలో కయాదు హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు ప్యారడైజ్ లో కూడా చాన్స్ పట్టింది అని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజం అయితే అమ్మడి సుడి తిరిగినట్టే. నాని తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చాడు. ఆ లిస్ట్ లో ఈ చిన్నది కూడా చేరుతుందేమో చూడాలి.