Unstoppable Show: అన్ స్టాపబుల్‌లో సందడి చేయనున్న “వీర సింహారెడ్డి” టీం… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి కానుకగా డబుల్ బొనాంజా ఇవ్వనున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో కి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.

Unstoppable Show: నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి కానుకగా డబుల్ బొనాంజా ఇవ్వనున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్(Unstoppable Show) టాక్ షో కి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ టాక్ షో అత్యధిక టీఆర్పీలతో రికార్డులను తిరగరాస్తుంది. సీజన్ 1 ని విజయవంతంగా కంప్లీట్ చేసిన బాలయ్య… సీజన్ 2 ని కూడా అంత కంటే ఎక్కువ ఊపులో కొనసాగిస్తున్నారు. అయితే ఈ సంక్రాంతికి తన అభిమానులకు డబుల్ గిఫ్ట్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
సంక్రాంతి కానుకగా ఎపిసోడ్..
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “వీర సింహారెడ్డి” సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా… కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ గా దూసుకుపోతుంది.

veera simha reddy team in unstoppable show
కాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభాస్ ఎపిసోడ్ అయితే రికార్డులు తిరగరాసి యాప్ కూడా క్రాష్ అయ్యింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ కి వీరసింహారెడ్డి టీం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆహా సంస్థ ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో వీర సింహారెడ్డి టీం షో లో పాల్గొన్న ఫోటోలను పోస్ట్ చేశారు. ఆ పహవలను చూస్తే షో లో హీరోయిన్లు హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ ని సంక్రాంతికి టెలికాస్ట్ చేయనున్నారు. దీంతో సంక్రాంతికి ఒక వైపు వీర సింహారెడ్డి, మరో వైపు ఈ షో తో బాలయ్య డబుల్ ట్రీట్ ఇస్తున్నారని ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రతుత్తం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Eesari pandugaki Balayya tharapununchi oka mass kanuka. God of Masses with the team of the MASSive Veera Simha Reddy.
Unstoppable Sankranti Celebrations with NBK! Coming Soon#UnstoppableWithNBKS2 #VeeraSimhaReddy #NBKOnAHA #NBK #NandamuriBalakrishna pic.twitter.com/kNcF76K9cS— ahavideoin (@ahavideoIN) January 9, 2023

veera simha reddy team in unstoppable show

veera simha reddy team in unstoppable show
ఇవి కూడా చదవండి…
Ram Gopal Varma: కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
Director Bobby: నువ్వు రాజకీయాలకు పనికిరావు అన్నయ్య.. పాలిటిక్స్ కు తమ్ముడు ఉన్నాడు.. డైరెక్టర్ బాబీ కామెంట్స్
Shahrukh Khan : డిల్లీ అంజలి ఘటనపై స్పందించిన షారూఖ్ ఖాన్.. కుటుంబానికి అండగా ఉంటానంటూ
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/