Home Town Teaser: వందకు 116 మార్కులు – నవ్వులు పూయిస్తున్న హోమ్ టౌన్ టీజర్

Home Town Web Series Teaser: ఓటీటీలోకి కొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. రాజీవ్ కనకాల, నటి ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్’. త్వరలో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 4ను ఆహా వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆహా ‘హోమ్ టౌన్’ టీజర్ రిలీజ్ చేసింది.
లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు టీజర్ చూస్తుంటే అర్థమైపోందింది. టీజర్‌లోని కొన్ని సీన్స్ ’90’స్ – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ మూవీని తలపిస్తున్నాయి. ఇందులో కామెడీ బాగా ఆకట్టుకుంది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా, కుటుంబ బంధాల విలువలను హత్తుకునేలా రూపొందిన ఈ టీజర్ ఆద్యాంతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ టీజర్ ఈ వెబ్ సిరీస్‌పై మరింత ఆసక్తి పెంచుతోంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.