Last Updated:

Mufasa: The Lion King: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Mufasa: The Lion King: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Mufasa The Lion King OTT Release Date: హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘ది లయన్‌ కింగ్‌’కి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) తెరకెక్కిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 20న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్‌లో భాషల్లో రిలీజై మంచి విజయం సాధించింది. తెలుగులో ముఫాసా టైటిల్‌ రోల్‌కి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు వాయిస్‌ ఇవ్వడంతో ఈ సినిమాకు ఇక్కడ మంచి క్రేజ్‌ వచ్చింది. మహేష్‌ బాబుతో పాటు జగపతి బాబు, బ్రహ్మనందం, ఆలీ వంటి ప్రముఖుల ఆయా పాత్రలకు వాయిస్‌ అందించారు.

దీంతో ముఫాసా: ది లయన్‌ కింగ్‌ తెలుగులో మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. సుమారు రూ. 1260 కోట్లతో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.3,200 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడీ బ్లాక్‌బస్టర్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. వరల్డ్‌ వైడ్‌ ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ సొంతం చేసుకుంది. దీంతో ఫిబ్రవరి 18 నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్‌కి ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉండనుందని చెప్పి ఓటీటీ ప్రియులకు షాక్‌ ఇచ్చింది. ఈ సినిమా చూడాలంటే సబ్‌స్క్రైబర్స్‌ కూడా అదనంగా డబ్బు చెల్లించి చూడాలని స్పష్టం చేసింది.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ఫ్రీగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. ఆపై ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో ఆన్ డిమాండ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ సినిమా తెలుగులో టైటిల్ రోల్‌కు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ అందించగా.. హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించాడు. బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాల్ట్ డిస్నీ పిక్చర్స్ బ్యానర్‌పై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ నిర్మించారు.

ఇవి కూడా చదవండి: