Mohan Babu: సుప్రీం కోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట
Mohan Babu Gets Relief in Supreme Court: సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్ దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు ఊరట నిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
కాగా జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన ముందుస్తు బెయిల్ కోసం మొదటి ఆయన తెలంగాణ హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతేడాది డిసెంబర్ 23న ఆయన పటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దానిని సవాల్ చేస్తూ మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తన చిన్న కుమారుడు మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అంతేకాదు జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది.
తనని లోపలికి రానివ్వకపోవడం మంచు మనోజ్ గేట్ పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. దీంతో మంచు విష్ణు అనుచరలు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అసహనంతో ఇంటికి నుంచి బయటకు వచ్చని మోహన్ బాబు ఓ జర్నలిస్ట్ అడిగి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండ, అతడిపై దాడి చేశాడు. ఈ సంఘటనపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన ఆయన బహరంగంగా క్షమాపణలు చెప్పడమే కాకుండా.. దాడి జరిగిన జర్నలిస్ట్ రంజిత్‌ని ఆస్పత్రిలో స్వయంగా కలిసి పరామర్శించారు.