Last Updated:

SSMB29: జూలు విదిల్చిన సింహంలా నడిచొస్తున్న మహేష్.. లీకైన వీడియో వైరల్

SSMB29: జూలు విదిల్చిన సింహంలా నడిచొస్తున్న మహేష్.. లీకైన వీడియో వైరల్

SSMB29: ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో SSMB29  మొదటి స్థానంలో ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో  సూపర్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం SSMB29. ఈ కాంబో కోసం మహేష్ బాబు అభిమానులు ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది.

 

SSMB29 పూజా కార్యక్రమాలను చాలా సింపుల్ గా పూర్తిచేసుకొని సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ సినిమా కోసం బాబు మేకోవర్ మాములుగా లేదు. యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడని టాక్. ఇక ఈ సినిమా కోసం మహేష్ జుట్టు, గడ్డం పెంచేశాడు. ఇప్పటికే ఆయన లుక్ చూస్తుంటే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

 

SSMB29 నుంచి ఏ చిన్న వార్త వచ్చినా కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చనే చేస్తున్నారు బాబు అభిమానులు. మొన్నటికి మొన్న మహేష్ జిమ్ చేస్తున్న వీడియో లీక్ అయ్యింది. అందులో మహేష్ న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు సెట్ నుంచి మరో వీడియో లీక్ అవ్వడం  సెన్సేషన్ ను సృష్టిస్తోంది. ఈ వీడియోలో మహేష్ .. నడుచుకుంటూ వస్తున్నాడు. అక్కడ సీరియస్ సన్నివేశం షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

కొంతమంది రౌడీలు మహేష్ ను వెనక నుంచి తోస్తూ.. ఒక వ్యక్తి వద్దకు తీసుకెళ్తున్నారు. వీల్ చైర్ లో కూర్చున్న వ్యక్తి డాన్ లా కనిపిస్తున్నాడు. అతని వద్దకు వెళ్లిన మహేష్ ను ఆ రౌడీలు మోకాళ్ల మీద కూర్చోపెట్టారు. ఇప్పుడు ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మహేష్ అలా సీరియస్ లుక్ లో నడిచి వస్తుంటే.. గాలికి జుట్టు ఎగురుతూ.. జూలు విదిల్చిన సింహంలా కనిపించాడు. ఇక ఈ  వీడియో చూసిన అభిమానులు సూపర్.. ఇదే కదా మాకు కావాల్సింది  అని చెప్పుకొస్తున్నారు.

 

ఇక మరికొంతమంది అభిమానులు మాత్రం.. లీక్స్ వస్తున్నాయి.. చూసుకో జక్కన్నా అంటూ సలహాలు ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాదు.. సినిమా ప్రేక్షకులు మొత్తం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న మొదలుపెట్టిన ఈ కథ.. దాదాపు స్టోరీ ఫినిష్ చేయడానికే రెండేళ్లు తీసుకున్నాడు. మరి ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేసి, ఎప్పుడు రిలీజ్ చేస్తాడో జక్కన్నకే ఎరుక.  ఈ సినిమాతో వీరిద్దరూ ఎలాంటి రికార్డులను బద్దలు కొడతారో చూడాలి.