Published On:

Mass Jathara: తూ మేరా లవర్ అంటున్న రవితేజ..

Mass Jathara: తూ మేరా లవర్ అంటున్న రవితేజ..

Mass Jathara: మాస్ మహారాజా రవితేజకు విజయాపజయాలతో పని లేదు. ఒక సినిమా హిట్ అయ్యిందా.. ప్లాఫ్ అయ్యిందా.. ? అనేది పట్టించుకోడు. నెక్స్ట్  సినిమా చేస్తున్నామా .. ? లేదా.. ? అనేదే చూస్తాడు. గతేడాది మిస్టర్ బచ్చన్ సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 

హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న రైడ్ కు రీమేక్ గా తెరకెక్కింది. లైన్ మాత్రమే తీసుకొని కంటెంట్ మొత్తం  మార్చేసి హరీష్ శంకర్.. మసిపూసి మారేడు కాయ చేశాడు. అయినా కూడా ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కలేదు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ దక్కించుకోవాలని రవితేజ.. మాస్ కథతో రాబోతున్నాడు.

 

రవితేజ హీరోగా కుర్ర డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్  జాతర. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్  పై సూర్యదేవర నాగవంశీ  ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో ధమాకా సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మాస్ జాతర సినిమా నుంచి మేకర్స్ ఒక కీలక అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా మొదటి సింగిల్ ను ఏప్రిల్ 14 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక  కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. తూ మేరా లవర్ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ లో రవితేజ  ఊర మాస్ లుక్ లో కనిపించాడు.

 

రవితేజ, శ్రీలీల మాస్ డ్యాన్స్ ఎలా  ఉంటుంధో ధమాకాలోనే చూసాం. ఇప్పుడు మరోసారి ఈ కాంబో మాస్ జాతరలో  సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికీ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ ను కూడా క్రియేట్ చేసింది. ఇక మాస్ సాంగ్స్ కు మ్యూజిక్ అదరగొట్టే  భీమ్స్ .. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీంతో  సాంగ్స్ పై కూడా ఫ్యాన్స్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి  విజయాన్ని అందుకుంటాడో చూడాలి.