Published On:

Kamal Haasan: కన్నడ భాషపై కామెంట్స్‌ – కమల్ హాసన్‌కు బిగ్‌షాక్‌, థగ్‌లైఫ్‌పై నిషేధం

Kamal Haasan: కన్నడ భాషపై కామెంట్స్‌ – కమల్ హాసన్‌కు బిగ్‌షాక్‌, థగ్‌లైఫ్‌పై నిషేధం

Kamal Haasan Thug Life Movie Banned in Karnataka: కన్న డ భాషపై కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయంలో ఆయన క్షమాపణలు చెప్పాలని కన్నడ అధికార, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా కమల్‌ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఆయన క్షమాపణలు చేప్పాలని మే 30 వరకు డెడ్‌లైన్‌ పెట్టింది. కానీ ఆయన మాత్రం తాను క్షమాపణలు చెప్పేదే లేదని తేల్చేసారు అయితే తాజాగా ఈ వ్యవహరంలో కేఎఫ్‌సీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఆయన సినిమా థగ్ లైఫ్‌ను కర్ణాటకలో బ్యాన్‌ చేస్తున్నట్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇచ్చిన గడువులోగా క్షమాపణలు చెప్పకపోవడంతో నిషేధం అమ్మలోకి వస్తుందని ఫిల్మ్‌ చాంబర్‌ ప్రతినిధి సారా గోవిందు స్పష్టం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ అనుకూల సంస్థల డిమాండ్లకు కూడా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇటీవల బెంగళూరుఓ జరిగిన థగ్‌ లైప్‌ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లో కమల్‌ హాసన్‌ చేసిన కామెంట్స్‌ వివాదానికి దారి తీశాయి. తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం కన్నడీగులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

 

ఆయన వ్యాఖ్యలపై కన్నడ భాష సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమల్‌ క్షమాపణలు చెప్పాలని లేదంటే ఆయన సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించాయి. కమల్‌ తమ మనోభవాలు దెబ్బతీశారని, తమిళ సినిమా విడుదలైన ప్రతిసారి కన్నడ భాషను అవమానిస్తున్నారంటూ ఆయనపై కర్ణాటక రక్షణ వేదిక ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కమల్‌ మాత్రం తాను క్షమాపణలు చెప్పనన్నారు. అవి ప్రేమ పూర్వకంగా చేసిన వ్యాఖ్యలు.. ప్రేమకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇక భాషపై రాజకీయ నాయకులకు మాట్లాడే హక్కు లేదన్నారు. చివరికి తనకు కూడా అన్నారు. తాను తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతానని, లేని పక్షంలో తాను అసలు క్షమాపణలు చెప్పనని, తన శైలియే అంత అన్నారు.

ఇవి కూడా చదవండి: