Published On:

Dhee Re Release: మంచు విష్ణు కెరీర్ బెస్ట్ మూవీ రీరిలీజ్.. ఆయన కోసమైనా చూడాల్సిందే

Dhee Re Release: మంచు విష్ణు కెరీర్ బెస్ట్ మూవీ రీరిలీజ్.. ఆయన కోసమైనా చూడాల్సిందే

Dhee Re Release:  ఈమధ్యకాలంలో కొత్త సినిమాల కన్నా.. పాత సినిమాల రీరిలీజ్ వేడుకలే ఘనంగా జరుగుతున్నాయి. అప్పట్లో కథలు అలా ఉండేవి. అప్పుడు ఇలా ఫ్యాన్ వార్స్,నెగిటివ్ ట్రెండ్స్, ఓటీటీ లేవు కాబట్టి.. ప్రతి ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లే సినిమా చూసేవాడు. మార్చి నెలలో కొత్త సినిమాల కన్నా రీ రిలీజ్ సినిమాలే విజయవంతంగా నడుస్తున్నాయి.

 

తాజాగా మరో హిట్ సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది. మంచు మోహన్ బాబు వారసుడుగా విష్ణు అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత విష్ణు ఒక  మంచి హిట్  కోసం చాలా కష్టపడ్డాడు. ఇక విష్ణు కెరీర్ లోనే ఫిస్ట్ హిట్ ఢీ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందించాడు. మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో విష్ణు సరసన జెనీలియా నటించగా.. శ్రీహరి కీలక పాత్రలో నటించాడు. 

 

2007 లో రిలీజైన ఢీ మూవీ మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రతి నటుడిని గుర్తించడానికి ఒక సినిమా ఉన్నట్లే.. మంచు విష్ణు సినిమాలు అనగానే టక్కున అందరికీ  గుర్తొచ్చే సినిమా ఢీ. శ్రీను వైట్ల మార్క్ సినిమా. స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, సునీల్ కామెడీ నెక్స్ట్ లెవెల్. ఇప్పటికీ మీమ్స్ లో ఈ కామెడీ సీన్స్ ను వాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా శ్రీహరి పాత్ర హైలైట్ అని చెప్పాలి. అప్పటివరకు హీరోగా సినిమాలు చేస్తూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలుపెట్టిన శ్రీహరి.. ఈ సినిమాలో శంకర్ గౌడ్ పాత్రలో నటించి మెప్పించాడు.

 

ఢీ సినిమా కథ, కామెడీ, మ్యూజిక్.. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టని సినిమాల్లో ఇది ఒకటి. ఒక రౌడీ దగ్గర జాబ్ జాయిన్ అయిన ఒక తెలివిగల కుర్రాడు. అతని చెల్లినే ప్రేమించి, రహస్యంగా పెళ్లి చేసుకొని.. కాపురం చేస్తూనే.. తన తెలివితో చివరకు ఆ రౌడీ చేతనే తన చెల్లిని పెళ్లి చేసుకోమని చెప్పిస్తాడు.  అన్నాచెల్లెలి సెంటిమెంట్, ఇచ్చిన మాట కోసం రౌడీ అయినా కూడా నిలబడిన తీరు.. ప్రేమ కోసం ఎంత రిస్క్ అయినా చేయొచ్చు అని ఈ సినిమా ద్వారా చూపించాడు దర్శకుడు.

 

ఇక దాదాపు  ఏళ్ళ తరువాత ఢీ రీరిలీజ్ కు రెడీ అవుతోంది. మార్చి 28 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుందని మంచు విష్ణు తన ట్విట్టర్ లో తెలిపాడు. ఇక ఈ న్యూస్ తెలియడంతో ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.  విష్ణు కోసం కాకపోయినా శ్రీహరి కోసమైనా చూడాలని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. ఏప్రిల్ 25 న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ సినిమాపై హైప్ తీసుకురావడానికి విష్ణు ఢీ రీ రిలీజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో ఫ్యాన్స్ ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి: