Single Trailer: శివయ్యా.. కన్నప్పకు కోపమొచ్చిందయ్యా

Single Trailer: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరో హీరోయిన్లుగా కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నిన్నటికి నిన్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ప్రయోగాలను పక్కన పెట్టీ తనకు అచ్చొచ్చిన కామెడీనే ఈసారి శ్రీవిష్ణు నమ్ముకున్నాడు. ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేశారు. ఇక ఇందులో శ్రీవిష్ణు.. శివయ్యా, మంచు కురిసిపోవడం అనే రెండు పదాలను ఉపయోగించడం జరిగింది. ఆ రెండు పదాలు డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా మంచు వారసుడు విష్ణుపై ట్రోల్స్ యేనని తెలుస్తోంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా టీజర్ లాస్ట్ లో మంచు విష్ణు.. శివయ్యా అని అరుస్తాడు. అది ఎంత ట్రోలింగ్ కు గురైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు అదే ట్రోల్ ను విష్ణు కూడా వాడాడు. ఆ మాడ్యులేషన్ లోనే విష్ణు కూడా శివయ్యా అని అరవడం ఒకటి అయితే.. చివర్లో అమ్మాయిలను నమ్మితే మంచు కురిసిపోవడమే అని చెప్పిన డైలాగ్ లో మంచు అని తన విష్ణు ఇంటిపేరును వాడారు. ఇలా ఈ రెండు పదాలను మంచు కుటుంబం తీవ్రంగా ఖండిస్తుందని సమాచారం. ముఖ్యంగా మంచు విష్ణు ఈ ట్రైలర్ పై అసహనం వ్యక్తం చేశాడని ఇన్ సైడ్ టాక్.
ట్రైలర్ నుంచి ఈ రెండు పదాలను తీసివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడట. వీలైతే.. కోర్టుకు కూడా వెళ్ళే అవకాశాలు లేకపోలేదు అని కూడా అంటున్నారు. ఎన్ని అనుకున్నా.. మంచు విష్ణుకు ఈ రెండు పదాలు కోపం తెప్పిస్తాయి అని చెప్పొచ్చు. అందుకే చాలా కోపం మీద ఉన్న మా ప్రెసిడెంట్ గారు.. ఫిల్మ్ ఛాంబర్ లో కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యాడట. మరి ఈ విషయం సీరియస్ అవుతుందా.. ? లేక సినిమా రిలీజ్ లోపు సాల్వ్ అవుతుందా.. ? అనేది చూడాలి.