Adipurush Movie : ఆ దేశంలో వివాదంలో చిక్కుకున్న ఆదిపురుష్.. సినిమా రిలీజ్ కి అడ్డంకి !
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “ఆదిపురుష్“. ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా చేస్తుండగా.. బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు 500కోట్ల
Adipurush Movie : బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం “ఆదిపురుష్“. ఈ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కించగా ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో మెప్పించారు. సుమారు 500కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రాముడి కథతో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై ఆసక్తిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. మరోవైపు ‘జై శ్రీరామ్’ పాట యూట్యూబ్‌ను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వరల్డ్ వైడ్ గా దాదాపు 6000 పైగా థియేటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ కాగా.. ఇండియా లోనే 4000 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పుడు తాజాగా అనుకోని రీతిలో ఈ సినిమాకి నేపాల్ దేశంలో వివాదం ఎదురైంది. ఎంతలా అంటే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వమంటూ నేపాల్ సెన్సార్ బోర్డ్ కూడా స్పష్టం చేసింది. ఇంతకీ అసలు ఆ వివాదం ఏంటి ? సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అనే విషయాలు మీకోసం ప్రత్యేకంగా..
ఆదిపురుష్ చిత్రం రిలీజ్ కి కూడా సమస్య వచ్చేలా వివాదం రావడానికి గల కారణం మూవీలో ఒక డైలాగ్. ఈ చిత్రంలో సీత మాత భారత్ లో జన్మించినట్లు డైలాగ్ ఉంది. దీంతో చరిత్ర ప్రకారం సీత మాత నేపాల్ లో జన్మించారని.. ఆ డైలాగ్ ని తీసేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. పలువురు నేపాల్ నేతలు కూడా సినిమాలో డైలాగ్ పట్ల మండిపడుతున్నారు. దీంతో చిత్ర యూనిట్ సినిమాలోని ఆ డైలాగ్ ని తొలిగించి రిలీజ్ కి లైన్ క్లియర్ చేసుకున్నారు. కానీ వివాదం కారణంగా ఈరోజు మార్నింగ్ షోలను పలువురు నిలిపివేసినట్లు తెలుస్తుంది.