Motorola G85: లాస్ట్ ఛాన్స్.. మోటరోలా G85పై వేలల్లో డిస్కౌంట్.. ఈ ఆఫర్ వదలొద్దు..!
Motorola G85: ఈ సంవత్సరం లాంచ్ అయిన మోటరోలా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ G85 ధర మరోసారి గణనీయంగా తగ్గింది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న కొత్త సేల్‌లో, ఈ మోటరోలా ఫోన్ దాని లాంచ్ ధర కంటే వేల రూపాయల చౌకగా లభిస్తుంది. మోటరోలా G85 శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో పాటు 12GB RAMతో సహా అనేక శక్తివంతమైన ఫీచర్లు అందించారు.
Motorola G85 Offers
మోటరోలా G85 ను రెండు స్టోరేజ్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు – 8GB RAM + 128GB, 12GB RAM + 256GB. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.20,999. అదే సమయంలో, దాని టాప్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 22,999గా జాబితా చేశారు. ఈ ఫోన్ ప్రస్తుత సేల్‌లో రూ.5,000 తక్కువ ధరకు లభిస్తుంది.
Motorola G85 Discounts
మీరు దీన్ని రూ. 15,999 ప్రారంభ ధరకు ఇంటికి తీసుకురావచ్చు. దీనితో పాటు, ఫోన్ కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్, రూ.13,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే, రూ.10,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Motorola G85 Features
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల 3D కర్వ్డ్ p-OLED డిస్‌ప్లే ఉంది. ఫోన్ డిస్‌ప్లే 120Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ అందించారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో 33W USB టైప్ C ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. ఈ ఫోన్‌తో కంపెనీ రెండేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్‌లను అందిస్తోంది. దీని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, దీనిలో 50MP ప్రైమరీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32MP కెమెరా ఉంది.
ఇవి కూడా చదవండి:
- Samsung Galaxy S25 5G Price Drop: చూసేలేపు పోతది.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.15 వేలు డిస్కౌంట్.. అందరికంటే ముందే కొనండి!