Jyothika: నీ భర్త కంటే విజయ్ చాలా బెటర్ – నెటిజన్ కామెంట్స్ జ్యోతిక రియాక్షన్ ఇదే!

Jyotika Reacts on Netizens Comments: కోలీవుడ్ క్యూట్ కపుల్లో సూర్య, జ్యోతికల జంట ఒకటి. ఈ జంట ఎప్పుడూ మీడియా ముందు ఒకరిపై ఒకరు ప్రేమ, గౌరవంతో వ్యవహరిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌లో జ్యోతిక సూర్యకు చాలా సపోర్టుగా నిలుస్తుంటారు. ఈ విషయాన్ని సూర్య ఎన్నో సందర్భాల్లో చెప్పాడు కూడా. అయితే, తాజాగా సూర్యకు కించపరుస్తూ చేసిన కామెంట్‌కి జ్యోతిక తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది.
ఇటీవల సూర్య నటించిన కంగువా మూవీ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయంలో పలువురు హీరో ఫ్యాన్స్, ఓ వర్గం వారు సూర్యని ట్రోల్ చేస్తున్నారు. సూర్య సినిమాల కంటే లవ్‌టుడే ఫేం ప్రదీప్ రంగనాథన్ సినిమాలు బెటర్ అని, డ్రాగన్, లవ్‌టుడే చిత్రాల కంటే ఎక్కువ కలెక్షన్స్ సూర్య తీసుకురమ్మనండి అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతేకాదు సూర్య కంటే దళపతి విజయ్ చాలా బెటర్ అంటున్నారు. ఇదే విషయాన్ని నేరుగా జ్యోతికతోనే అన్నాడు ఓ నెటిజన్. నీ భర్త(సూర్య) కంటే హీరో విజయ్ బెటర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టాడు. దీనికి జ్యోతిక స్పందిస్తూ అవునా! నిజమా! అన్నట్టుగా ఓ స్మైలీ ఎమోజీతో తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ తర్వాత ఆ కామెంట్స్‌ని డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.