Sankranthiki Vasthunam: సర్‌ప్రైజ్.. సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ – స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Sankranthiki Vasthunam OTT Release Date Locked: వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పర్ఫెక్ట్ పొంగల్ చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద రూ. 300 పైగా కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.
అయితే ఈ మూవీ టెలివిజన్ ప్రీమియర్, డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ కంటే ముందే మూవీని టీవీలోకి తీసుకువస్తున్నట్టు సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ప్రముఖ జీ తెలుగు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ కంటే ముందే టీవీలో ప్రసారం చేస్తామని చెప్పి షాకిచ్చింది జీ తెలుగు. అలాగే ప్రసారం తేదీని కూడా ప్రకటించింది.
మార్చి 1వ తేదీన టీవీలో సంక్రాంతికి వస్తున్నాం మూవీని ప్రసారం చేస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఇప్పుడు టీవీ, ఓటీటీ ప్రియులకు డబుల్ సర్‌ప్రైజ్ ఇస్తూ తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది జీ తెలుగు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చింది. ఈ సినిమాను టీవీల్లో ప్రసారం చేయడంతో పాటు ఓటీటీలోనూ ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఊపించారు. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో మూవీ ప్రసారం చేయడంతో పాటు అదే రోజు (ZEE5)లో స్ట్రీమింగ్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
దీంతో సినీ ప్రియులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటరల్లో కేవలం తెలుగులో రిలీజైన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అంతేకాదు ఓటీటీలో వెర్షన్‌లో అదనంగా కొన్ని సీన్స్ కూడా యాడ్ చేసినట్టు సినీవర్గాల నుంచి సమాచారం. నిడివి కారణంగా తొలగించిన పలు కీలక కామెడీ సీన్లను ఓటీటీలో వెర్షన్ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు గుసగుస. మరి దీనిపై క్లారిటీ రావాలంటే సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.